Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలని, ప్రత్యేక డ్రైవ్ గా క్యాంపెయిన్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ప్లాంటేషన్, ఎన్ఆర్ఈజిఎస్, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, కోర్టు కేసులు, రెడ్ క్రాస్ మెంబర్ షిప్, పదవీ విరమణ కార్యక్రమం, ఎస్సీ, ఎస్టీ ప్రివెన్సెస్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్, తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాంటేషన్ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో 10 లక్షలకు పైగా మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 6 వేల ప్లాంటేషన్ చేయడం జరిగిందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్లాంటేషన్ కోసం ఆప్ సిద్ధం చేయాలని, ప్రత్యేక డ్రైవ్ లాగా విస్తృతంగా క్యాంపెయిన్ చేయాలన్నారు. ఉపాధి హామీ కింద 40,000 మొక్కలకు, 9,000 ఎకరాల హార్టికల్చర్ ప్లాంటేషన్ కి అనుమతి ఇచ్చామని, ఇంకా ప్రతిపాదనల దశలో ఉందని, వేగంగా పనులు చేపట్టి వచ్చేవారంలోగా పనులు పురోగతిలోకి తీసుకురావాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ కి సంబంధించి కేటాయించిన లక్ష్యం వచ్చే వారంలోగా 100 శాతం పూర్తి చేయాలన్నారు. అర్బన్ ప్రాంతానికి సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా నోడల్ అధికారిగా జడ్పి సిఈఓ మొక్కల పెంపకాన్ని మానిటర్ చేయాలన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలను జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని, జిల్లాస్థాయిలో కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకు అందరు జిల్లా అధికారులు హాజరుకావాలన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో జాబితా తయారు చేయాలన్నారు. అన్ని శాఖల పరిధిలో వివిధ ప్రభుత్వ పథకాల గురించి క్లుప్తంగా తెలిసేలా పోస్టర్లను తయారు చేసి ఆవిష్కరించాలన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అనంతపురం కలెక్టరేట్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్ చేయించాలని, ఆర్డీవో కార్యాలయాలకు కూడా ఐఎస్ఓ సర్టిఫికెట్ చేయించాలని, త్వరితగతిన ఇది పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఇన్చార్జిగా ప్రతిరోజు కొన్ని కోర్టు కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి రిపోర్టులు అందజేయాలన్నారు.
అన్ని శాఖల జిల్లా, మండల అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ జీవితకాల సభ్యత్వం నమోదు చేసుకోవాలి.
రాష్ట్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా శాఖను మొదటి స్థానంలో నిలపాలన్నారు. అన్ని శాఖల జిల్లా, మండల అధికారులు, వారి సిబ్బంది, తహసిల్దార్లు, ఎంపీడీవోలు అందరూ రెడ్ క్రాస్ తరఫున జీవితకాల సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకోసం దరఖాస్తు ఫారం, ఐడి ప్రూఫ్, 2 ఫోటోలు అందించాలని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై వచ్చే 7 రోజుల్లోపు సభ్యత్వం నమోదు పూర్తి కావాలన్నారు. వివరాలకు రెడ్ క్రాస్ సెక్రటరీ గోపికృష్ణ (ఫోన్ నెంబర్లు : 9849499788, 9666629797)ను సంప్రదించాలన్నారు.
సామూహిక పదవీ విరమణ కార్యక్రమానికి సంబంధించి ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేసే వారి పెన్షన్ ప్రతిపాదనలు పంపించాలన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ చేయబోయే వారి పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్సెస్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద పరిహారం అందజేత సంపూర్ణంగా అమలు కావాలని, బాధితులకు సకాలంలో పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల పరిధిలోనూ కిందిస్థాయి ఉద్యోగులకు వచ్చేవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్పెషల్ గ్రేడ్ ప్రమోషన్స్ అందించే కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డిపిఓ ప్రభాకర్ రావు, ఎస్డిసి శిరీష, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజారావు, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప, డిఈఓ వరలక్ష్మి, డీఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, హార్టికల్చర్ డిడి ఫిరోజ్ ఖాన్, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, డిటిసి వీర్రాజు, సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, మెప్మా పిడి విజయలక్ష్మి, ఎల్డిఎం నర్సింగ్ రావు, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, డిసిఓ అరుణకుమారి, డీఎస్ఓ శోభారాణి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, సర్వే ఏడి రూప్ల నాయక్, చేనేత జౌళి శాఖ ఏడి అప్పాజీ, మార్కెటింగ్ ఏడీ చౌదరి, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, జిల్లా మలేరియా అధికారి ఓబులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img