విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం చదురుగుడి నందు నెలకొల్పబడిన 9 హుండీలను బుధవారం ఉదయం గం.8.00 లకు జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ, సహాయ కమీషనర్ టి.అన్నపూర్ణ ప్రత్యక్ష పర్వవేక్షణలో పీవీ.లక్ష్మీ ,తనిఖీదారు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి వారి సమక్షంలో తెరచి లెక్కించగా 37 రోజులకు గాను నగదు రూపంలో రూ.13,43,881/- లు, బంగారం రూపములో 18 గ్రాముల 600 మిల్లి గ్రాములు వెండి రూపంలో 486 గ్రాములు వచ్చినది అని ఆలయ కార్యనిర్వహణాధికారి డి. వి. వి. ప్రసాదరావు తెలియజేశారు కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సేవా సమితి, శ్రీవారు సేవ వార, కెనరా బ్యాంకు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.