acaiwater.com www.bonusheda.com www.bonusorti.com www.bonusdave.com gamersbonus.com www.bonusarsiv.com www.bonusfof.com rcflying.net www.bonustino.com www.onlinesporbahisi.com texasslotvip.com gamefreebonus.com bonusrey.com visiopay.com heatextractors.com
Friday, September 27, 2024
Friday, September 27, 2024

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి – ఏపీటీఎఫ్

విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) రాష్ట్ర సంఘం పిలుపుమేరకు సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ “విద్రోహ చీకటి దినం”గా అభివర్ణిస్తూ ధర్మవరం స్థానిక తహసిల్దార్ కార్యాలయం -పాత తాలూకా కేంద్రం నందు ఏపీటిఎఫ్ సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షులు కే. బలరాముడు, సానే రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడు కే. బలరాముడు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం (ఓ పి ఎస్) తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ విధానాలు మాకు ఆమోదయోగ్యం కాదని, ఉద్యోగ ఉపాధ్యాయుల 20 సంవత్సరాల కోరికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు, పెత్తందారులకు తలవొగ్గి ఉద్యోగ ,ఉపాధ్యాయ & కార్మికుల పట్ల సిపిఎస్, జిపిఎస్, యుపిఎస్ అంటూ కేవలం పేరు మారుస్తూ ఉపాధ్యాయులను మభ్య పెడుతున్నారని, భవిష్యత్తులో జడ్పీఎస్ (జీరో పెన్షన్ విధానం) ను తెస్తారేమో అని ఎద్దేవా చేశారు. ప్రాథమిక విద్యకు గొడ్డలి పెట్టు అయిన జీవో నెంబర్ 117 ను మున్సిపల్ పాఠశాల వ్యవస్థకు ప్రతిబంధకమైన జీవో నెంబర్ 84 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ పరిధిలో గల ధర్మవరం పట్టణ ,రూరల్ బాధ్యులు ఈశ్వరయ్య శివానంద, వాసు కుమార్, కృష్ణమూర్తి, శంకర్ నారాయణ, నాగప్ప, శ్రీనివాసులు, జగదీష్ , చెన్నే కొత్తపల్లి మండల బాధ్యులు బాలయ్య, దుర్గ ప్రసాద్, సూర్య ప్రకాష్, రామగిరి మండల బాధ్యులు నరసింహులు, బయన్న, బత్తలపల్లి మండల బాధ్యులు గోపాల్,భాస్కర్ మరియు సీనియర్ నాయకులు సత్యనారాయణ, ఓబులేసు, హజ్జే నాయక్,శివయ్య,ఖాజా మొహీబ్, శ్రీనివాసరెడ్డి, చంద్ర, కృష్ణమూర్తి, శ్రీనివాసులు, పర్వతయ్య,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img