acaiwater.com www.bonusheda.com www.bonusorti.com www.bonusdave.com gamersbonus.com www.bonusarsiv.com www.bonusfof.com rcflying.net www.bonustino.com www.onlinesporbahisi.com texasslotvip.com gamefreebonus.com bonusrey.com visiopay.com heatextractors.com
Friday, September 27, 2024
Friday, September 27, 2024

మూడు రోజులుగా ముంపులోనే బాధితులు

. ప్రకాశం బ్యారేజీపై రాకపోకల బంద్‌
. లంక గ్రామాలకు వరద నీరు
. మున్నేరు వద్ద తగ్గిన వరద
. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపార పంట నష్టం ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు, జగన్‌ పర్యటన

భారీ వర్షం, వరదల ప్రభావంతో కృష్ణానదీ తీరం అల్లకల్లోలంగా మారింది. బుడమేరు పరివాహక ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. ఏకకాలంలో అటు కృష్ణానది, బుడమేరు ఉధృతి ఆయా ప్రాంతాల ఇళ్లను నీట ముంచెత్తింది. సకాలంలో ప్రభుత్వం యంత్రాంగం చర్యలకు ఉపక్రమించకపోవడంతో మూడు రోజుల నుంచి బాధితులు ముంపులోనే చిక్కుకున్నారు. నదీ పరివాహక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు నీట తేలియాడుతున్నాయి. దాదాపు 4లక్షల మంది ముంపు భారీనపడ్డారు. మున్నేరు వరద నీరు కృష్ణానదికి చేరడంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి ఉధృతి కొనసాగుతోంది.

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: భారీ వర్షం, వరదల ప్రభావంతో కృష్ణానదీ తీరం అల్లకల్లోలంగా మారింది. బుడమేరు పరివాహక ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. ఏకకాలంలో అటు కృష్ణానది , బుడమేరు ఉధృతి ఆయా ప్రాంతాల ఇళ్లను నీటముంచెత్తింది. సకాలంలో ప్రభుత్వం యంత్రాంగం చర్యలకు ఉపక్రమించకపోవడంతో మూడు రోజుల నుంచి బాధితులు ముంపులోనే చిక్కుకున్నారు. నదీ పరివాహక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు నీట తేలియాడుతున్నాయి. దాదాపు 4లక్షల మంది ముంపు భారీనపడ్డారు. మున్నేరు వరద నీరు కృష్ణానదికి చేరడంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి ఉధృతి కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి బుడమేరు ముంపు వాసులు నీటిలో జీవనం సాగిస్తూ బిక్కుబిక్కు మంటున్నారు. బుడమేరు గేట్లను ఎత్తిన విషయం పరిసర ప్రాంతాల నివాసితులకు చేరవేయడంలో లోపం వల్ల ముంపు నష్టం మరింతగా పెరిగింది. బుడమేరు పరివాహక ప్రాంతాలైన విజయవాడలో కొన్ని ప్రాంతాలు ముంపు భారీనపడ్డాయి. అజిత్‌సింగ్‌నగర్‌, రాజరాజేశ్వరిపేట, భవానీపురం, ఆంధ్రప్రభ కాలనీ తదితర ప్రాంతాలు సోమవారం కూడా నీటి ముంపులోనే ఉన్నాయి. చాలా మంది ఇళ్ల భవనాలపైన, అపార్టుమెంట్లకే పరిమితమై పోయారు. బాధితులను పూర్తిస్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. రామలింగేశ్వరనగర్‌, యనమలకుదురు ప్రాంతాల్లోకి కృష్ణా వరద నీరు వచ్చింది. 125ఏళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ దగ్గర 11లక్షలకుపైగా క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. వరదల కారణంగా కృష్ణా జిల్లాలో మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా 432 రైళ్లను రద్దు చేశారు. మంత్రులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు 19 మంది మృతిచెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టానికి గురైంది. 34వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 1067.57 కిలో మీటర్లు మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వరి పంటకు అపార నష్టం జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం మున్నేరు వద్ద వరద తగ్గడంతో ఐతవరం వద్ద విజయవాడహైదరాబాద్‌ రహదారిలో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి వాహనాలను పంపిస్తున్నారు.
సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో
రెస్క్యూ ఆపరేషన్‌
విజయవాడ నగరంతోపాటు కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య బృందాలను నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి3, పంజాబ్‌ నుంచి4, ఒడిశా నుంచి 3 బృందాలు చేరుకున్నాయి. పవర్‌ బోట్లు, రెస్క్యూ పరికరాలతో వారు విధుల్లో నిమగ్నమయ్యారు. హెలికాఫ్టర్లతో వరద సహాయక చర్యలు చేపడుతున్నారు. డ్రోన్లతో ఆహార సరఫరాకు ప్రభుత్వం నిమగ్నమైంది. విజయవాడ నగరంలో ప్రాంతాల వారీగా అధికారులను, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. విజయవాడ పశ్చిమ, తూర్పు, సెంట్రల్‌ నియోజకవర్గాల్లోని మూడు నియోజకవర్గాల్లో డివిజన్ల వారీగా కేటాయించి, సహాయ చర్యలను ముమ్మరం చేశారు. వైద్యఆరోగ్యశాఖ అధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీకి చర్యలు చేపట్టారు. బాధితులకు సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్లు8181960909, 08662424172 ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img