తెదేపా మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు, లక్ష్మణ్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : -పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు కిలో పూర్ణచంద్రరావు, ఆండ్రాబు లక్ష్మణ్ అన్నారు. మండలంలోని అంజలి శనివారం కిటుముల పంచాయతీలలో వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ అల్పపీడనం కారణంగా మన్యంలో రైతులకు అపార నష్టం వాటిల్లిందన్నారు. వర్షాలు అవసరమైన వ్యవసాయ అదనులో కురవని వర్షాలు నేడు అల్పపీడన ప్రభావం వలన ఎడతెరిపి లేకుండా కురుస్తుండడం వలన పంటలు చాలావరకు దెబ్బతిన్నాయన్నారు. ఇందులో వేరుశనగ కూడా ఉందన్నారు. ఇటువంటి సమయంలో వ్యవసాయ శాఖ అధికారుల, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు రైతులకు ఎంతో అవసరం అన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. రైతులంతా వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తున్న సూచనలతో పంటలను కాపాడుకునేందుకు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు గొల్లోరి మంగు, గెమ్మెలి అబ్బాయి నాయుడు, మహేంద్ర, నాగు, మధు, లోకేష్, ఆయా గ్రామ పంచాయితీల ప్రజలు, ప్రతినిధులు పాల్గొన్నారు.