గ్రామంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించిన రామరాజు పడాల్
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- పంద్రాగస్టు వేడుకలను స్థానిక కేంద్రీకృత ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాగిన రామరాజు పడాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వందలాదిమంది విద్యార్థులతో గ్రామంలో 50 మీటర్ల జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప కార్యక్రమం అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడిందన్నారు. ఆ స్ఫూర్తితోనే నేడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకోవడంతో పాటు హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.