బాధితుడు కుడిపూడి వెంకటరమణ
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అల్పపీడన ప్రభావంతో మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్థానిక పాత్రికేయుడు కుడిపూడి వెంకటరమణ కు చెందిన మరుగుదొడ్డి కుప్పకూలింది. మరుగుదొడ్డి కుప్పకూలిన సమయంలో వెంకటరమణ కుటుంబ సభ్యులు ప్రయాణంలో ఉండడంతో ప్రమాదం తప్పింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా మట్టి కోతకు గురి కావడమే మరుగుదొడ్డి కూలిపోవడానికి కారణంగా కనిపిస్తుంది. మంగళవారం చింతపల్లి వచ్చిన వెంకటరమణ కుటుంబ సభ్యులు కుప్పకూలిన మరుగుదొడ్డి ని చూసి ఖిన్నులయ్యారు. తుఫాను విపత్తు వలన కూలిన మరుగుదొడ్డి కి సంబంధించి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.