వీరన్న పడాల్ ను పరామర్శించిన మాజీ మంత్రి బాలరాజు
విశాలాంధ్ర – చింతపల్లి :- అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలో చికిత్స పొంది ఇంటి వద్ద ఉన్న చింతపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి వీరన్న పడాల్ (బాబులు) ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంకిపాటి వీరన్న పడాల్ (బాబులు) చింతపల్లి సర్పంచ్ గా పంచాయతీలోని ప్రజలకు ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన అనారోగ్యం పాలు కావడం దురదృష్టకరమన్నారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలో మరలా చురుకుగా ప్రజా సవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. తరతరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్న వీరన్న పడాల్ గతంలో చింతపల్లి సర్పంచ్ గా ఈ ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందించిన విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు మరువలేరన్నారు. ఆయన సేవలు మన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో అవసరం అన్నారు. అటువంటి వ్యక్తి అనారోగ్యం పాలై ఇంటికే పరిమితం కావడం బాధాకరమన్నారు. వీరన్న పడాల్ ను ప్రమర్శించిన సమయంలో ఆయనతోపాటు ఉగ్రంగి లక్ష్మణరావు ఉన్నారు..