అదనపు సబ్ ఇన్స్పెక్టర్ వెంకట రమణ
శాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మత్తు పదార్థాల జోలికి పోవద్దు… జీవితాలను నాశనం చేసుకోవద్దని చింతపల్లి అదనపు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశమైన ఆయన ముందుగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన కలుగు అనర్ధాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయన్నారు. అటువంటి వాటి జోలికి పోకూడదని, గంజాయి సాగు, రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, విద్య, క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.