జయలక్ష్మి భర్త సత్యనారాయణ మరణించిన విషయం తెలుసుకొని లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించిన వైకాపా అధిష్టానం.
పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను, అల్లూరి జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి లకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీటీసీ జయలక్ష్మి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- భర్త మరణంతో కుంగిపోయిన ఎంపీటీసీ చిందాడ జయలక్ష్మి కి వైకాపా ఆర్థిక అండగా నిలిచింది. తోటి ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండడంతో చలించిన ఎంపీపీ కోరాబు అనూష దేవి, జయలక్ష్మి కుటుంబానికి ఆర్థిక చేయూతనందించాలని పాడేరు మాజీ శాసనసభ్యురాలు, వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆమె విషయాన్ని అధినేత దృష్టిలో పెట్టడంతో స్పందించిన అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జయలక్ష్మి కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకునేందుకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఇచ్చిన సూచనల మేరకు విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చిన్న శ్రీను, భాగ్యలక్ష్మి, అనూష దేవి లతో కలసి జయలక్ష్మిని విజయనగరం పిలిపించి మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు తో కలసి జయలక్ష్మి కి పార్టీ పరంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో తన భర్త తపాలా శాఖలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. ఆ విషయాన్ని సోదరి ఎంపీపీ అనూష దేవి, వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలు, పాడేరు మాజీ శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ద్వారా తెలుసుకున్న పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో లక్ష రూపాయలను ఉమ్మడి విజయనగరం జిల్లా ఛైర్పర్సన్ చిన్న శ్రీను చేతుల మీదుగా తనకు అందించడం సంతోషంగా ఉందన్నారు. తనకు పార్టీ పరంగా ఆర్థిక సహాయం అందేందుకు కృషిచేసిన ఎంపీపీ అనూష దేవి, అల్లూరి జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ చిన్న శ్రీను, పరీక్షిత్ రాజు లతోపాటు తన ఆర్థిక ఇబ్బందులను, పతివియోగాన్ని అర్థం చేసుకొని పెద్ద మనసుతో లక్ష రూపాయలు పంపించిన పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.