విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :-ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం (A P A G S), భారతీయ విద్యార్థి ఫెడరేషన్ (S F I), జన విజ్ఞాన వేదిక ( J V V) ల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ పాఠశాలలు ఆశ్రమ వసతి గృహ పాఠశాలలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు రాష్ట్రస్థాయి ప్రజ్ఞ వికాసం ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రజ్ఞ వికాసం ప్రతిభా పరీక్షల్లో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులను ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించిన విద్యార్థికి రూ.5.000/, రెండవ స్థానానికి రూ.3.000/, మూడవ స్థానానికి రూ 2.000/. బహుమతి గా ఇవ్వడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి. జీవన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తిక్. గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి సంఘాలుగా ఉంటూ నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన విద్యాభివృద్ధికి తమ సంఘాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని, ముఖ్యంగా పబ్లిక్ పరీక్షలకు ముందు ప్రతిభను నిరూపించుకునే ప్రతిభా పరీక్షలు నిర్వహించి విద్యార్థులలో ఉన్న భయాందోళనలను పోగొట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా జరగబోవు 10వ తరగతి పరీక్షలలో ఎటువంటి భీతి లేకుండా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు అవకాశం ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రతిభా పరీక్షలు ఆదివారం చింతపల్లి, జీకే వీధి కొయ్యూరు, జి మాడుగుల మండలంలో కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రసాద్, వెంకటేష్, రమ్య, సాగర్, అధిక సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.