విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.28.08.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో త్రాగు నీటికి విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో మంచినీటి సౌకర్యం కోసం నాడు నేడు పథకం క్రింద 10 లక్షలు రూపాయలతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసారు. నిర్వహణ లోపంతో ఈ పథకం మూలకు చేరడంతో విద్యార్థులు త్రాగు నీటికి తరచూ ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల సుమారు 40 గ్రామాల నుండి విద్యార్థులు చోడవరం జూనియర్, డిగ్రీ కళాశాలలో చదువుకోసం రోజూ వస్తూ వుంటారు. తాగు నీటి విషయంలో కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో
మంచినీటి కోసం విద్యార్థులు రోడ్డుపైకి వెళ్లి వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని తాగవలసి వస్తుంది. తక్షణమే కాలేజి యాజమాన్యం విద్యార్థులకు అవసరమైన త్రాగునీటి ఏర్పాట్లు పరిరక్షించాల్సినదిగా కోరుతున్నారు.