విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.21.08.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం లో మాల మహానాడు, అంబేద్కర్స్ ఇండియా మిషన్ (ఏ.ఐ.ఎం) ఆధ్వర్యంలో వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అంటూ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కు వ్యతిరేకంగా బుదవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. “మాలల పంతం – వర్గీకరణ అంతం ” అంటూ భారీ నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నేతలు మాట్లాడుతూ, వర్గీకరణ తో మాలలు అన్ని విధాలా వెనుకబడిపోతారని అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు దేశ వ్యాప్తంగా జరిగిన బంద్ కు మద్దతుగా చోడవరం నియోజవర్గంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, హోటల్స్ షాపింగ్ మాల్స్ వగైరా భారీ నిరసన కార్యక్రమాలతో మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షుడు బూసి కోటి , మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సీయాద్రి శ్రీనివాస్,
వేచలపు ప్రకాష్, వైస్ ఎం.పి.పి.కొత్తపల్లి లోవ, చందు, శ్రీనివాస్, ఏ.ఐ.ఎం.అధ్యక్షులు శేఖర్, రేగిన అప్పారావు, కామరాజు, మీసాల మోహన్, వీర్రాజు, మురళి లోవరాజు, కనకరాజు, రవికుమార్, శివ కళ్యాణ్ కిరణ్,మహేంద్ర తదితరులు పాల్గొన్నారు..