విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.23.08.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామంలో
రామాలయం వద్ద శుక్రవారం సమావేశం నిర్వహించి గ్రంథాలయ స్థాపనకు శ్రీకారం చుట్టారు. పి.ఎస్.ఎన్. మూర్తి గ్రంథాలయ స్థాపనకు కావసిన రూము, మిగిలిన సౌకర్యాలు గురించి తెలియజేసారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా బుక్ డిపాజిట్ సెంటరు ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉందని వారు తెలియజేసారు.
గ్రామ సర్పంచ్ ఎస్.వి. రమణ(శ్రీను), వైస్ ప్రెసిడెంట్ బి.సింహాచలం నాయుడు, పాల సంఘం కార్యదర్శి సన్ని బాబు, వెంకట లక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొని సభను జయప్రదం చేసారు. లక్కవరం గ్రామంలో గ్రంథాలయ స్థాపనకు పి.ఎస్.ఎన్. మూర్తి, డి. మురళిధర్ సుమారు 100 కు పైగా పుస్తకాలను ఎస్ వి రమణ కు లైబ్రరీ స్థాపన కోసం వితరణ చేసారు. గ్రంథాలయ స్థాపనకు తప్పక కృషిచేస్తామని, మంచిరోజును ఎన్నుకొని గ్రామ ప్రజలకు ఉపయోగపడేవిధంగా గ్రంథాలయాన్ని తీర్చుదిద్దుతామన్నారు. ఎస్.పి.పి.ఎల్ సొసైటీ సేవలను వినియోగించుకుంటామని
సర్పంచి ఎస్ వి రమణ గారు తెలియ జేశారు. సమావేశం అనంతరం గ్రామ సర్పంచి ఎస్.వి రమణ, గ్రామవైస్ ప్రెసిడెంట్ బి. సింహాచలం నాయుడు చొరవ తీసుకొని గ్రంథాలయ స్థాపనకు క్రుషి చేస్తున్నందుకు ఎస్పి.పిఎల్.సొసైటి అధ్యక్షులు పి ఎస్ ఎన్ మూర్తి ని దశాలువాతో సత్కరించారు. లైబ్రరీ ఉన్నతికి ముందు ముందు ఎలాంటి సహాయ సహకారాలు కావాలో ఎస్‌పిఐ ఎల్‌అందుబాటులో ఉంటుందని సోసైటీ అధ్యక్షులు పిఎస్‌ఎన్ మూర్తి ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తెలియజేశారు. సభ ఘనంగా నిర్వహించి, వందన సమర్పణ చేసారు.