విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.27.09.2024ది. మాజీ మంత్రి దివంగత మహానేత బలిరెడ్డి సత్యారావు ఆరవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అభిమానులు, వై.సి.పి. నాయకులు ఘన నివాళులు అర్పించారు. జాతీయ కాంగ్రెస్ తరఫున ఆరు దశాబ్దాలకు పైగా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ రాజ్యమేలిన అతి సునిశతమైన నేతగా అన్ని వర్గాల ప్రజలు అభిమానాన్ని పొంది, మచ్చలేని మహానేత గా కీర్తిశేషులు బలిరెడ్డి రాజకీయ జీవితం చోడవరానికి అంకితం చేసారు. ఈ కార్యక్రమంలో చోడవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యేడువాక సత్యారావు, లక్ష్మీపురం పి.ఏ.సి.ఎస్. అధ్యక్షుడు శానాపతి సత్యారావు, ఎం.పి.పి. గాడి కాసమ్మ, వై.సి.పి. నాయకులు ఓరుగంటి నెహ్రుబాబు, మాజీ జెడ్పీటీసీ బొడ్డేడ సూర్యనారాయణ, ఏ.ఎం.సి. మాజీ చైర్మన్ వెంపలి ఆనందేశ్వరరావు, హారికా రామకృష్ణ, దండుపాటి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.