Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

కార్మికులను తప్పుదారి పట్టిస్తున్న ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.21.08.2024ది. అనకాపల్లి జిల్లాలో గల ది. చోడవరం (గోవాడ) సహకార చక్కెర కర్మాగారంలో కార్మికులను తప్పుదారి పట్టించేందుకు, రాజకీయ లబ్ధి కోసమే ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నాయకులు అమాయకులైన కార్ముకులచే బుధవారం ఆందోళన చేయించారని సుగర్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె.భాస్కరరావు తెలిపారు. గడిచిన ) సీజన్ లో కార్మికులు, కర్షకుల కృషితో లక్షా డెబ్బై వేల మెట్రిక్ టన్నుల చెరకు గానుగాట ఆడి, మార్చి 12 తో ఫ్యాక్టరీ క్రషింగ్ ముగిసిందన్నారు. ఎన్నికల కోడ్ తో జూన్ 9 వరకు రీకాల్ కోసం ఒత్తిడి చేసినను, కనీసం మూడు నెలలు కృషింగ్ చేయలేని ఫ్యాక్టరీకి, కార్మికుల చే 9 నెలలు ఓవరాయిలింగ్ పనులు ఎలా చేయించగలమని ఫ్యాక్టరీ అధికారులు చెప్పిన విషయం అన్ని యూనియన్ నాయకులకు తెలుసునని అన్నారు. ఫ్యాక్టరీ లో కార్మికుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు దృష్టికి తీసుకు వెళ్ళామని తెలిపారు. ఫ్యాక్టరీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి కార్మికుల సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. అలాగే కార్మికుల రీకాల్ పై ఎం.డి. ద్వారా కలెక్టర్ కు నోట్ పెట్టామని తెలియజేసారు. సెప్టెంబర్ నెలలో కార్మికులను రీకాల్ చేయిస్తామన్న ఎమ్మెల్యే పత్రికా ప్రకటన చేశారన్నారు. ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు, కార్మికులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మాతృ సంస్థ అయిన చక్కెర కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలే తప్ప, స్వప్రయోజనాల కోసం బురద జల్లే ప్రయత్నం మానుకోవలసిందిగా హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తలారి సత్యనారాయణ, ఏడువాక నారాయణరావు, బండి శ్రీను, సత్యనారాయణరాజు, త్రినాధ్, శ్రీను, వెంకటరావు, రాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img