విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేసిన నిష్టల లక్ష్మీ కాంతం శనివారం గౌరవ పదవి విరమణ పొందారు. జెడ్.పి. గర్ల్స్ హైస్కూల్ లో సోషల్ టీచరుగా పని చేసిన లక్ష్మి కాంతంకు, హెచ్.ఎం. ఐ.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో పదవీ విరమణ సన్మానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీమతి గుమ్మాల సత్య సత్తిబాబు, వైస్ చైర్ పర్సన్ పిల్లి నాగమణి, నారాయణ పాఠశాల ఉపాద్యాయులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు