– హైడ్రో పవర్ ప్లాంట్లు నిర్మాణంతో రిజర్వాయర్లకు పెను ప్రమాదం…
విశాలాంధ్ర – చోడవరం/మాడుగుల (అనకాపల్లి జిల్లా) : తే. 16.08.2024ది.
అనకాపల్లి జిల్లా వి.మాడుగుల నియోజకవర్గంలో గిరిజన ప్రాంతానికి ఆనుకొని ఉన్న రిజర్వాయర్ల పై ఆదాని కన్ను పడిందని, సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయిన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసారు. దేవరాపల్లి మండలంలోని రైవాడ, చీడికాడ మండలం కోనాం ప్రాజెక్టులకు వచ్చే శారదా నది పైన, చల్ల గెడ్డ పైన కోనాం ప్రాజెక్టుకు నీళ్లు వచ్చే బోడ్డెరు నదిపైన అదాని కన్ను పడిందన్నారు. ఈ రెండు సాగు నీటి ప్రాజెక్టులు అత్యంత కీలక మైన,నది ప్రరివాహక ప్రాంతాలుగా ఉండడంతో పాటు దట్టమైన అడవులు ఉండంతో ఈప్రాంతాన్ని అదాని హైడ్రోపవర్ ప్లాంట్లులకు ఎంచుకున్నారని తెలిపారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చకచకా ఆనుమతులు ఇచ్చేస్తున్నాయని అన్నారు. దీంతో అదాని చేతుల్లోకి అడవులు వెళ్ళిపోతున్నాయని అందోన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గిరిజనులు బ్రతుకులు పూర్తిగా బుగ్గి పాలై వన్య ప్రాణులకు తీవ్రమైన నష్టం కలగడంతో పాటు కోణాం, రైవాడ ఆయ కట్టు భూములు ఎడారిగా మార బోతున్నాయని ఆవేదన వ్వక్తం చేసారు. అదాని కంపినికి చేందిన ఏజెంట్లు ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ భూ పరీక్షలు ప్రారంబించారని తెలిపారు. మరోవైపు ఫారెస్ట్ అదికారులు అదాని ఎజెంట్లు కలిసి సర్వేలు నిర్వ హించడం జరుగు తుందన్నారు. గిరిజనులు ఎక్కడికక్కడ అడ్డుకుని పంపించేస్తున్నారని తెలియజేసారు. కానీ ప్రాజెక్టులు క్రిందన ఉన్న ఆయకట్టు రైతులకు చీమకుట్టి నట్టు అయిన లేక పోవడం దుర్మార్గ మన్నారు. గిరిజనులు పట్టు వదలకుండా. పోరాడుతున్నారని తెలిపారు. హైడ్రోపవర్ ప్రాజెక్టులను కట్టాలని అనుమతి కోరకు పారెస్టు ఉన్నతాధికారులు అనుమతులు కోరకు అదాని కంపెనీ ఏజెంట్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీన్ని గిరిజనులు ప్రతిఘటించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరిగినను దానికి ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించ వలసి ఉంటుందని స్పష్టం చేశారు. ఈప్రాంతంలో హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం జరిగితే దేవరాపల్లి మండలంలోని వాలాబు పంచాయతీలో సగం గ్రామాలకు, చింతలపూడి పంచాయతీ లోని సగం గ్రామాలు అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం లోని సరియా, మాడ్రేబు, మాకనాబిల్లి, దాయిర్తి, రేగులపాలెం, తముటు కుడియా గ్రామాలుతో పాటు చీడికాడ మండలంలోని కోనాం, రైవాడ ప్రాజెక్టుకు గల ఆయకట్టు భూములు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు, గిరిజనులు జీవన పరిస్తితులు దెబ్బతి నడంతో పాటు వన్య ప్రాణులకు, అటవీ ప్రాంతానికి నష్టం కలుగు తుందని తెలిపారు ఇంత మందికి నష్టం జరుగుతుందని తెలిసి అదికార పార్టి, అదాని కంపెనీకి అడవులను తాకట్టు పెట్టి పబ్బం గడుపు కోవాలని చూస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతామని విస్రుతంగా మొక్కలు నాటాలని ఈబాధ్యతను పవన్ కల్యాణ్ కు అప్పగించాలని నిర్ణంచిన ప్రభుత్వం దట్టమైన అడవుల్లో ప్రమాదకరమైన హైడ్రో పవర్ ప్లాంట్లుకు ఏవింగా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు, ఈప్రారంతం లోని గిరిజనులను మోసం చేసి వారికి డబ్బులు అశ చూపించి సర్వే పనులు చేయిస్తున్నారని తెలిపారు అదాని హైడ్రోపవర్ ప్లాంట్ ప్రమాదం తీవ్రంగా ఉంటుందని,ప్రజలు గుర్తించాలని తెలిపారు కోంతమంది స్వార్ద పరులు మాటలు నమ్మి గిరిజనులు మోస పోవద్దని అన్నారు ఎట్టి పరిస్థితు ల్లోనూ పారెస్టు అదికారులు అనుమతులు ఇవ్వరాదని కోరారు ప్రభుత్వ అదికారులు ఆనుమతులు ఇవ్వడం వలన ఈప్రాంతం లోని గిరిజనులకు అదాని మనుసులకు ఘర్షణులు జరిగే ప్రమాదం ఉందన్నారు ఈప్రాంతంలోని హైడ్రోపవర్ ప్లాంట్ పనులు జరగాలంటే గిరిజనులు అనుమతి గ్రామసభ పీసాచట్టం అటవి హక్కులు చట్టం 1/70 చట్టం లాంటి అనేక చట్టాలు ఉన్నాయని విటిని దిక్కరించి ప్రభుత్వం పారెస్టు అదికారులు ఎవిదంగా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు గతంలో కూడా చింతలపూడి కూడియా రేగులపాలెం నగరం పాలెం
ప్రాంతాలోని పవర్ ప్లాంట్లు కోసం పనులు ప్రారంబించగా గిరిజనులు ముక్త కంఠంతో వ్యతిరేఖించడం జరిగిందన్నారు ప్రాజెక్టు పనులు నిలుపుదల చేయక పోతే ప్రత్యక్ష ప్రతి ఘటన తప్పదని హెచ్చ రించారు రీజర్వ పారెస్టులో అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు, గిరిజనులు చిన్నపాటి పోడు వ్వవసాయం చేస్తె కేసులు పెట్టె ప్రభుత్వం అడవులు నాశనం చేసె అదాని కంపెనీకి అడవులు తాకట్టు పెడాతరా! అని ప్రశ్నించారు? ఈప్రారంతలోని హైడ్రోపవర్ ప్లాంట్ కు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని వారు కోరారు అడవులను అదాని కంపెనీకి తాకట్టు పెట్టె ప్రతి పాదనలు మాను కోవాలని వెంకన్న డిమాండ్ చేసారు.