విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : రాష్ట్రంలోని చరిత్ర ప్రసిద్ధి చెందిన స్వయం భూ దేవాలయాలు అన్నింటిలో ఒక్కటైన అనకాపల్లి జిల్లా చోడవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించెడి నవరాత్రి ఉత్సవ పోస్టర్లను స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చేతుల మీదుగా శనివారం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్త సులభుడైన మహా గణపతి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇక్కడి గణపతిని భక్తులు, ప్రజలు కార్యసిద్ది గణపతిగా నిత్య అర్చనలు, దర్శనాలు ఇక్కడి నమ్మకం అని తెలిపారు. స్వయం భూ విఘ్నేశ్వర ఆలయంలో సెప్టెంబర్ 7 నుండి 15 వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్.వి.వి. సత్యనారాయణ మూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ పసుమర్తి సాంబశివరావు, అర్చకులు కొడమంచిలి వెంకటరావు, చలపతిరావు మరియు ఉత్సవ సభ్యులు గునూరు పెదబాబు, చేకూరి రాజు, సిరిపురపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.