– పేదలకు అన్నదానం, పలు సామాజిక సేవలు …
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం జర్నలిస్ట్ సంఘం (ఏ.పి.యూ.డబ్లూ.జె) అధ్యక్షుడు డి.వెంకట ముత్యాలు నాయుడు (డి.వి.ఎం.నాయుడు) ఆధ్వర్యంలో సంఘం 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం చోడవరం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వేంకటేశ్వర ఆలయ ఆవరణలో పేదలకు అన్నదానం చేశారు. పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సంఘం అధ్యక్షుడు డి.వి.ఎం. నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత, అభివృద్దికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని తమ ఐక్యతను చాటి చెప్పారు.