Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ఎం.పి. గారూ మాట నిలబెట్టుకోండి…..

– గోవాడ ఘగర్ ఫ్యాక్టరీని ఆదుకోండి ….

– భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఎం.) ….

విశాలాంధ్ర – చోడవరం : అనకాపల్లి ఎం.పి. సి.ఎం. రమేష్ 2024 ఎన్నికల ముందు ప్రజలకు, కార్మిక, కర్షక రంగాల వారికి ఇచ్చిన హామీ నిలబెట్టుకుని, ది.చోడవరం (గోవాడ) సహకార చక్కెర కర్మాగారాన్ని ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఎం.) జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.వెంకన్న సోమవారం నాడు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో కార్మిక, కర్షక వర్గాల ప్రజల మద్దతుతో అనకాపల్లి ఎంపీగా పోటిచేసి గెలిచిన సిఎం రమేష్ గోవాడ ఘగర్ ప్యాక్టరిని ఆదునీ కరిస్తామని, ఆదుకుంటామని ఇచ్చిన హమిని నిలబెట్టు కోవాలని కోరారు. చోడవరం, మాడుగుల రెండు నియోజకవర్గాల్లో సుమారు లక్షకు పైగా కార్మిక కర్షక కుటుంబాలు గోవాడ సహకార చక్కెర కర్మాగారం పై ఆధారపడి జీవిస్తున్నారు అని తెలిపారు. ఫ్యాక్టరీపై వెయ్యి మంది కార్మిక కుటుంబాలు, 24,500 వేల మంది సభ్య రైతులు ఉన్నారని తెలిపారు. సహకార రంగంలో రాష్ట్రానికే ఆదర్శంగా ఉన్న చోడవరం (గోవాడ) చక్కెర కర్మాగారం పరిస్థితి పాలకులు, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి తో ప్రస్తుతం పూర్తిగా అద్వాన్నంగా మారిందన్నారు. పంచ దారకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నను, అంతర్జాతీయ దిగుమతులు వలన మన పంచాదార ఎగుమతులు నిలిచిపోవడంతో, దేశంలో ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉండడంతో ఏడాదికి ఏడాది నష్టాలు ఊబిలో కూరికి పోతుందని తెలిపారు. ఏడాదికి 5 లక్షల 50 వేల టన్నులు చేరుకు క్రషింగ్ జరిపే చక్కెర కర్మాగారం ప్రస్తుతం 2 లక్షలు కూడా ఆడడం లేదన్నారు. క్రషింగ్ ఎంత జరిగినా, నిర్వహణ ఖర్చు తగ్గక పోవడంతో ఇబ్బంది కరంగా ఉందన్నారు. 1962 లో రోజుకు వెయ్యి టన్నులు చెరుకు గానుగ అడే ఫ్యాక్టరీని 4500 టన్నులు క్రషింగ్ కపాసిటీగా పెంచినా, ముడి సరుకు (చెరుకు) తగ్గి పోతుండ డంతో గత సీజన్ లో లక్షా 71 వేల టన్నులు మాత్రమే గానుగ ఆడిందని తెలిపారు. ప్యాక్టరి యాజమాన్యం రైతులకు సకాలంలో పేమెంట్లు చేయక పోవడంతో చెరుకు పంట సాగుపై రైతుల్లో ఆసక్తి తగ్గిపోతుందని అన్నారు. అంతే కాకుండా రైతులకు విపరీతంగా పెట్టుబడులు పెరగడం, మద్దతు ధర ఇవ్వక పోవడంతో రైతాంగం ఆందోళనలో పడ్డారని తెలిపారు.
ఇప్పటి వరకు రైతులకు పేమెంట్లు చెల్లించక పోవడంతో అన్నదాతలు పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకు పోయారని తెలియజేసారు. పైగా కార్మికులకు జీతాలు చెల్లించక పోగా ఆంటీసీజన్ పేరుతో 250 మంది ఎన్.ఎం.ఆర్, ఓచర్ పేమెంట్ కార్మికులను రోడ్డున పడేసారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున ఎన్నికల సమయంలో ఎంపీగా పోటీ చేసిన సి.ఎం.రమేష్ ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని ఆదుకుంటానని హామీ ఇవ్వడంతో ఆయన పైనే కార్మిక, కర్షక వర్గాలు అందరూ అశలు పెట్టుకున్నారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో మూతబడిన పరిశ్రమలు తెరిపించి, ఎంపీ సిఎం రమేష్ మాట నిలబెట్టు కోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 13 సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, వాటిలో ప్రస్తుతం గోవాడ (చోడవరం) కర్మాగారం తెరిచిఉండగా, మిగతావన్నీ మూతపడ్డాయన్నారు. మూతపడిన కర్మాగారాల్లో మెజార్టీ అనకాపల్లి జిల్లా లోనే ఉన్నాయని తెలిపారు. అవి కూడా అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన సీఎం రమేష్ పరిధిలోనే నాలుగు కర్మాగా రాలున్నాయని అన్నారు ఈ నాలుగు కర్మాగారాల్లో మూడు మూత పడ్డాయని తెలిపారు. ఎంపీ సీఎం రమేష్ మాటి మాటికి కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారని, దీని వల్ల వేలాది మందికి ఉపాది కలుగుతుందని చెబుతున్నారని, కూడా ఇది చాల సంతోషమని, కానీ ఉన్న పరిశ్రమలను మూతవేసి, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. మూత బడిన చక్కెర కర్మాగారాలు తెరిపిస్తె వాటి పరిధిలో లక్షలాది మంది రైతులు, వ్వవసాయ కార్మికులు,కార్మికులు సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతులు దిక్కుతోచని పరిస్థి తిల్లో ఉన్నారని, సంక్షోభంలో ఉన్న రైతు, వ్వవ సాయకార్మికులను ఆదువసింది పోయి అనకాపల్లి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని సెలవిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు అంటూ, ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తానని సెలవిచ్చారని తెలిపారు, బియ్యంతో ఇథనాల్ పరిశ్రమ వలన తీవ్ర ప్రమాదం, అర్దిక సంక్షోభం రావడం జరుగుందని అన్నారు. ప్రాణాంత కమైన ఇథనాల్ తయారీ కర్మాగారానికి ఈయన పూనుకోవడం అనకాపల్లి ప్రజల పై ఉన్నది అభిమా నమా? దురాభిమానమా?చెప్పాలన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లా చుట్టూ నిషేదిత ఫార్మ కంపెనీలు వలన వందలాది మంది ప్రాణాలు పోగోట్టు కుంటున్నారని తెలిపారు. అనకాపల్లి జిల్లా లోని చక్కెర కర్మా గారాలు విని యోగం లోకి వేస్తే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది సహకార చక్కెరకర్మా గారాలు సక్రంగా పని చేసినట్టేయితే లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు, వేలాది మంది యువకులకు ఉపాధి మెరుగుపడుతుందన్నారు . అంతే కాకుండా దేశానికి చక్కెర దిగుమతులు బాధ లేకుండా పోతుందని, తద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుందని తెలిపారు. ఖాయలాపడ్డ పరిశ్రమలను ఆదుకున్నారన్న మంచి పేరు కూడా సిఎం రమేష్ కు దక్కుతుంది అని, దేశీయ పరిశ్రమలను ఆదుకున్నారన్న ఘన కీర్తి కూడగట్టు కోవచ్చున్నారు. ఎంపీ గారు వీటి పై మరోసారి అలోచన చేసి, ద్రుష్టి సారించి సహకార చక్కెర కార్మాగారాలను తెరిపించి పూర్వ వైభవం తీసుకురావాలని ఎంపీ సిఎం రమేష్ ఎన్నికల మాట నిలబెట్టు కోవాలని వెంకన్న డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img