asd
Monday, July 15, 2024
Monday, July 15, 2024

దాహం తీర్చండి మహా ప్రభో!

విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి జిల్లా); మండలంలోని రావాడ పంచాయతీ పరిధి గొల్లగుంట గ్రామంలో బోరు మోటర్‌ మరమ్మత్తుకు గురై తాగు నీరు సమస్య ఏర్పడిరది. గ్రామంలో ఐదు రోజుల నుండి తాగు నీరు అందక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో రెండు చేతి బోరు పంపులు ఉన్నప్పటికీ వాటి ద్వారా సురక్షితమైన తాగు నీరు రావడం లేదని చెబుతున్నారు. దూరంగా ఉన్న నివాసాల బోరు నుండి తెచ్చుకుంటున్న అరకొర నీటితో కాలం వెళ్లదీయాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఇదే బోర్‌ మోటార్‌ రిపేర్‌ అవగా మరుసటి రోజునే ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి త్రాగు నీరు అందించారని, ఇప్పుడు మాత్రం ట్యాంకర్లు ద్వారా తాగు నీరు అందించడం లేదని ఆవేదన చెందుతున్నారు.పింఛను పంపిణిలో భాగంగా సోమవారం గ్రామానికి విచ్చేసిన నేతలు, అధికారులను ట్యాంకర్‌ ద్వారా నీరు అందించాలని కోరామని చెబుతున్నారు. అధికారులు త్వరిత గతిన బోరు మోటార్‌ రిపేర్‌ చేయించి సమస్య పరిష్కరించాలని లేదా ట్యాంకర్‌ ద్వారా అయినా తాగు నీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img