విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో సిద్ధిఫల ఎఫ్.పి.సి కలెక్షన్స్ సెంటర్లో సోమవారం 5వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంఘ వార్షిక నివేదికను ఛైర్మన్ టి.వి.ఎస్.నాయుడు, సి.ఈ.ఓ. లు చదివి వినిపించారు. సంఘం అభివృద్దికి సంఘంలో సుమారు 10 గ్రామాల నుండి 598 మంది రైతులు రైతు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సిద్దిఫల ఎఫ్.పి.సి.కలెక్షన్ సెంటర్ నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. రోలర్ రూరల్ మార్ట్ నుంచి మొబైల్ వాన్ సబ్సిడీ ద్వారా పొందడం జరిగిందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కోలా ఫణీంద్ర, జాగృతి సంస్థ అగ్రికన్సల్టెంట్ వంటకు రెడ్డి నాయుడు, బోర్డు డైరెక్టర్లు, సిబ్బంది, రైతు సభ్యులు పాల్గొన్నారు.