– ఎం.పి. సి.ఎం.రమేష్ చేతులు మీదుగా ఫించన్లు ….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేతులు మీదుగా మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో శనివారం ఉదయం ఎన్టీఆర్ సామాజిక ఫించన్లు పంపిణీ చేశారు. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సామాజిక ఫించన్లు పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యే, ఎం.పి.లు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఫించన్లు పంపిణీ చేసినట్లు ఎం.పి.రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకన్నపాలెం లోని ఫించను లబ్ధిదారులతో ఎం.పి. ముచ్చటించి, వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆదేశాలతో మండలాల్లోని అన్ని గ్రామాల్లో శనివారం తెల్లవారుజాము నుండే ఫించన్లు పంపిణీ ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం మీద ఉదయం 10 గంటలకు
మొత్తం 64,61,485 పింఛన్ లబ్దిదారులకు రూ.2,729.86 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.