విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో గల 61 ప్రభుత్వ పాఠశాలల విద్యా సంక్షేమ యాజమాన్య కమిటీ (ఎస్.ఎం.సి) చైర్మన్, వైస్ చైర్మన్ లకు మరియు సచివాలయ విధ్యా సంక్షేమ సహా ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఎమ్మార్సి కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారి కె.సింహాచలం మంగళవారం ప్రారంభించారు. చోడవరం మండల విద్యాశాఖాధికారి కె.సింహాచలం అధ్యక్షతన నిర్వహించిన శిక్షణలో కార్యక్రమ శిక్షకులు గా గర్ల్స్ హై స్కూలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా .ఐ.వి.రామిరెడ్డి ,ఆర్.చిరంజీవి గర్ల్స్ హై స్కూలు చైర్ పర్సన్ గుమ్మాల సత్య వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎం.ఈ.ఒ సింహాచలం నాయుడు మాట్లాడుతూ పాఠశాల సమగ్ర అబివృద్ధికి, నాణ్యమైన విద్య కు పాఠశాల యాజమాన్య కమిటీ కృషి చేయాలని, మధ్యాహ్న భోజన పధకం మరియు మరుగు దొడ్ల నిర్వహణను పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు బుధవారం మరియు శుక్రవారం నాడు., సంక్షేమ సహాయకులు మంగళవారం, గురువారం నాడు ఫొటోలు తీసి, సంబంధిత యాప్ లో ఖచ్చితంగా అప్లోడ్ చేయవలెనని తెలిపారు. ప్రతిరోజూ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాప్ లో పరిశీలనా పత్రంను సమర్పించవలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.కోలని స్కూల్ చైర్మన్ నేమాల హరి, లక్ష్మీపురం హైస్కూల్ చైర్మన్ నర్సింగరావు, గర్ల్స్ హై స్కూల్ వైస్ చైర్మన్ పిల్లి నాగమణి, తదితరులు పాల్గొన్నా రు.