Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ఉద్యోగులను మోసగించడానికే యు.పి.ఎస్‌. ….

పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ ….. – ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసగించే మరో బూటకపు ప్రయత్నమే ఈ ఏకీకృత పెన్షన్‌ పథకం (యు.పి.ఎస్‌) అని భారత కమ్యునిస్టు పార్టీ తీవ్రంగా విమర్శించింది. పాత పెన్షన్‌ పథకాన్ని (ఒ.పి.ఎస్‌) తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. ఈ నెల 24న కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన యుపిఎస్‌ పథకాన్ని కమ్యునిస్టు పార్టీ తీవ్రంగా నిరసించింది. పాత పెన్షన్‌ పథకం నాన్‌ కంట్రిబ్యూటరీ, పైగా సెంట్రల్‌ సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ -1972 ప్రకారం ప్రస్తుత పెన్షన్‌కు హామీ కల్పించబడుతుంది. 2004లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌.డి.ఎ ప్రభుత్వం జాతీయ పెన్షన్‌ పథకాన్ని (ఎన్‌.పి.ఎస్‌) జి.ఓ ద్వారా రహస్యంగా తీసుకువచ్చింది. 2004 జనవరి 1 నుండి రిక్రూట్‌ అయినవారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఆరోజు నుండీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కొత్త పెన్షన్‌ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ వారు పోరాట బాట చేపట్టారు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ – 2013 ఎన్‌.పి.ఎస్‌ కు చట్టబద్ధమైన ప్రాతిపదిక కల్పించేందుకు వీలుగా 2014 ఫిబ్రవరిలో నోటిఫై చేసింది.
పాత పెన్షన్‌ పథకం (ఒ.పి.ఎస్‌) పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు అనూహ్యమైన రీతిలో చేసిన పోరాటాలు, అటువంటి పోరాటాలకు కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యల సంయుక్త వేదిక మద్దతునివ్వడంతో బిజెపి ప్రభుత్వం ఎన్‌పిఎస్‌కు కట్టుబడాలన్న వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. కానీ యుపిఎస్‌ పేరుతో ఉద్యోగులకు కేంద్రం ఇవ్వచూపిన ప్యాకేజీని చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌ రూపంలో తమకు రావాల్సిన చట్టబద్ధమైన బకాయిలను రాకుండా చేయడానికి అదే మోసపూరితమైన కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తిరిగి ఒ.పి.ఎస్‌.కు మళ్ళాయి. పిఎఫ్‌ఆర్‌డిఎకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించే కాంట్రిబ్యూషన్‌లో తమ వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకే తిరిగి ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఒపిఎస్‌కు మళ్లిన రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అటువంటి అభ్యర్థనలన్నింటినీ మోడీ సర్కార్‌ తిరస్కరించింది. ఉద్యోగులు, కార్మిక సంఘాలు అవిశ్రాంతంగా చేసే పోరాటాలను కేంద్రం వ్యతిరేకిస్తోంది. అందువల్లే మోసపూరితమైన యుపిఎస్‌ పేరుతో మోడీ నేతృత్వంలోని ఎన్‌డి కూటమి ఈ బూటకపు ప్రయత్నాన్ని చేపట్టింది, ఎన్‌పిఎస్‌ను అనేక ఉద్యోగ సమాఖ్యలు బహిష్కరించాయి. ఎన్‌పిఎస్‌లో మార్పులను అధ్యయనం చేయడానికి ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి.సోమనాథన్‌ కమిటీ చేసిన సిఫార్సులను ఈ బూటకపు యుపిఎస్‌ ప్రయత్నానికి వాడుకు న్నారు. ఎన్‌పిఎస్‌, కత్తిరించబడిన ఒపిఎస్‌ల మిశ్రమమే యుపిఎసస్‌గా వుంది. దీన్ని కేంద్ర కేబినెట్‌ ఈ నెల 24న ఆమోదించింది.
ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నయా ఉదారవాద పంథాను అనుసరించే మోడీ నేతృత్వంలోని ఎన్‌డి ప్రభుత్వం, లబ్థి చేకూర్చే కొన్ని మార్పులను చేర్చి ఈ యుపిఎస్‌తో ముందుకు వచ్చింది. ప్రభుత్వం అదనంగా ఇచ్చే 4.5శాతం కంట్రిబ్యూషన్‌, 31-7-2024నాటికి ఎన్‌పిఎస్‌ కింద గల 99,77,165 మంది ఉద్యోగులు షేర్‌ మార్కెట్‌లో రూ.10,53,850 కోట్ల మేరకు పెట్టే పెన్షన్‌ నిధుల పెట్టుబడుల (అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌-ఎయుఎం)కు పెంపు మాత్రమే.
జిపిఎస్‌ (గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌) పేరుతో ఎన్‌పిఎస్‌ స్థానంలో యుపిఎస్‌ మాదిరిగా లేదా అంతకన్నా కొంత మెరుగైన పథకాన్ని గత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కనీసం పదేళ్ల సర్వీస్‌ గల వారు, పదవీ విరమణ చేయడానికి ముందు నెల జీతంలో 50శాతం మొత్తాన్ని పెన్షన్‌, 40శాతం యాన్యూటీ కొనుగోలుగా నిర్వచించారు. దీనిని ఎపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రంగా తిరస్కరించారు. ఒపిఎస్‌ మినహా మరేదీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అటువంటిదే లేదా అంతకన్నా తక్కువ లబ్ది కలిగించే పథకాన్ని, ఎన్‌పిఎస్‌లో కొన్ని మార్పులతో తీసుకువచ్చింది. మెజారిటీ ఉద్యోగులు దీన్ని కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. ఒపిఎస్‌ కన్నా తక్కువగా మరి దేన్నీ ఆమోదించేది లేదని చెప్పాలి.
ఉద్యోగుల నుండి 10శాతం కంట్రిబ్యూషన్లు, ప్రభుత్వం నుండి ప్రస్తుతమున్న 14శాతానికి బదులుగా 18,5శాతానికి పెంచిన కంట్రిబ్యూషన్ల ప్రాతిపదికన యుపిఎస్‌ను రూపొందించారు. ఎన్‌పిఎస్‌లో వినియోగదారుడు 60శాతం మొత్తాన్ని తీసేసుకోవచ్చు, మిగిలిన 40శాతం మొత్తాన్ని యాన్యుటీలో పెట్టుబడిగా పెట్టి పెన్షన్‌గా తీసుకోవచ్చు. యుపిఎస్‌ కింద మొత్తం పెన్షన్‌ నిధి అంతా ప్రభుత్వానికి ముందుగానే వెళ్లిపోతుంది. అందుకు అనుగుణంగా సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ఉద్యోగికి పది శాతం ప్రభుత్వం ఇవ్వాల్సి వుంటుంది. అంటే బేసిక్‌ పే ప్లస్‌ డిఎగా ఇవ్వాలి. 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి 5నెలల వేతన ప్రయోజనాలు, పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి రెండు మాసాల వేతన ప్రయోజనాలను రిటైరైన తర్వాత ఇస్తారు. గ్రాట్యుటీకి అదనపు ప్రయోజనంగా ఇది వుంటుంది.
యుపిఎస్‌లో, సాధారణ స్థాయిలో 25ఏళ్ల సర్వీసు పూర్తితో, 60 ఏళ్లకు రిటైరైతే సదరు ఉద్యోగి 12 నెలల సగటు బేసిక్‌ పేలో 50 శాతాన్ని పెన్షన్‌గా పొందుతాడు. ఇది 1-4-2025 నుండి అమల్లోకి వస్తుంది. అంటే 31-3-2025నాడు రిటైరైన వారికి ఇది వర్తిస్తుంది. దీని కన్నా ముందు రిటైరైన వారికి ఇది వర్తించదు. ఒపిఎస్‌లో పదేళ్ల సర్వీసు వుంటే చివరి నెల వేతనంలో 50
శాతం పెన్షన్‌గా వస్తుంది. 20ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే 50శాతం పెన్షన్‌గా వస్తుంది.
25ఏళ్ల కన్నా తక్కువ సర్వీసు చేసిన ఉద్యోగి యుపిఎస్‌లో తక్కువ పెన్షన్‌ పొందుతారు. 20ఏళ్ల సర్వీసు కలిగిన ఉద్యోగి 12నెలల సగటు బేసిక్‌ పేలో కేవలం 40శాతం మాత్రమే పెన్షన్‌గా పొందుతాడు. పదేళ్ల సర్వీసు చేసిన ఉద్యోగులు కేవలం సగటు బేసిక్‌ పేలో 20శాతం మాత్రమే పెన్షన్‌గా పొందుతారు. 25ఏళ్ల కన్నా తక్కువగా, పదేళ్ల సర్వీసు వరకు దామాషా పెన్షన్‌ కేసులో రూ.10వేలు కనీస పెన్షన్‌గా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒపిఎస్‌లో కనీస పెన్షన్‌ రూ.9వేలు ప్లస్‌ డిఎ (1-4-2025 నాటికి 57శాతంగా వుంటుంది. అంటే రూ.5130), అంటే కనీస పెన్షన్‌ 1-4-2025 నాటికి రూ.14,130 అవుతుంది. అందు వల్ల, ప్రతిపాదిత రూ.10వేల పెన్షన్‌ ఒపిఎస్‌లో సగంగా వుంటోం ది. పదేళ్ల సర్వీసు కన్నా తక్కువ వున్న వ్యక్తి, పదవీ విరమణ వయస్సు వచ్చే సమయానికి ఆ ఉద్యోగి ఏ పెన్షన్‌కూ అర్హుడు కాడు.
యుపిఎస్‌ కుటుంబ పెన్షన్‌ కింద 60శాతం పెన్షన్‌ అంటే 50శాతంలో 60శాతం. అంటే 25ఏళ్ల సర్వీసు కలిగిన వ్యక్తి రిటైరైతే చివరి వేతనంలో 30శాతం అని అర్థం. కనీస పెన్షన్‌ రూ.10వేలు కలిగిన ఉద్యోగులకు అందులో 60శాతం వుంటుంది. అంటే రూ.6వేలు వస్తుంది. కనీస పెన్షన్‌ రూ.10వేలు అనేది కేవలం పదవీ విరమణ చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. అది కుటుంబ పెన్షన్‌గా రాదు. కానీ పెన్షనర్‌ రిటైరైన తర్వాత ఏడేళ్ళు లోగా లేదా 67ఏళ్ళ వయస్సుకు ముందుగా మరణిస్తే ఆ వ్యక్తి చివరి వేతనంలో 50శాతం కుటుంబ పెన్షన్‌గా ఒపిఎస్‌ కింద వస్తుంది. ఆ తర్వాత కుటుంబ పెన్షన్‌ చివరి వేతనంలో 30శాతంగా వుంటుంది. 1-4-2025 నాటికి కనీస పెన్షన్‌ రూ.14,130గా వుంటుంది. యుపిఎస్‌ కనీస కుటుంబ పెన్షన్‌ మాత్రం రూ.6వేలుగానే వుంటుంది.
సర్వీసులో వున్న ఉద్యోగుల విషయంలో వినియోగదారుల సూచీ ప్రాతిపదికన డిఎ లేదా డిఆర్‌ అస్యూర్డ్‌ పెన్షన్‌ లేదా కనీస పెన్షన్‌ లేదా కుటుంబ పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. 1-4-2025 నుండి కొత్త బేస్‌ ఇండెక్స్‌ ప్రారంభిస్తారా లేక సర్వీసులో వున్నవారికి, ఒపిఎస్‌ పెన్షనర్లకు అదే శాతం డిఎ లేక డిఆర్‌ మంజూరు చేస్తారా అనేది ఇంకా వివరించలేదు. ఒపిఎస్‌లో పెన్షనర్‌ లేదా కుటుంబ పెన్షనర్‌ 80 ఏళ్ల వయస్సు పూర్తి చేసుకుంటే అదనంగా 20శాతం పెన్షన్‌ 85ఏళ్లు పూర్తి చేసుకుంటే 30శాతం, 90ఏళ్లు పూర్తి చేసుకుంటే 40శాతం, 95ఏళ్లు పూర్తి చేసుకుంటే 50శాతం, వందేళ్లు పూర్తి చేసుకుంటే వంద శాతం ఇస్తారు. అదనపు పెన్షన్‌కు అదే డిఎ కూడా ఇస్తారు. యుపిఎస్‌లో ఈ అదనపు పెన్షన్‌ అందుబాటులో లేదు. వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు జరిగినప్పుడల్లా ఒపిఎస్‌లో పెన్షన్‌, కుటుంబ పెన్షన్‌, కనీస పెన్షన్‌ సవరించబడుతుంది. యుపిఎస్‌లో ఇలాంటి హామీ లేదు. పెన్షన్‌ కమ్యూటేషన్‌ అంటే 40శాతం పెన్షన్‌ను ముందుగానే తీసుకోవడం ఒపిఎస్‌లో వుంది. యుపిఎస్‌లో లేదు. మరణించిన లేదా ఇన్‌వాలిడ్‌గా మారిన ఉద్యోగులందరూ ఎన్‌పిఎస్‌లో అన్‌ఫిట్‌ అవుతారు. ఒపిఎస్‌లో వారికి ఇప్పటికే వర్తిస్తుంది. ఉద్యోగులు యుపిఎస్‌ను లేదా ఎన్‌పిఎస్‌ను ఎంచుకోవచ్చు. ఒకసారి ఎంచుకుంటే ఇక అదే ఖరారవుతుంది.
యుపిఎస్‌లో ఇంకా చాలా లొసుగులు, లోపాలు వుండవచ్చు, యుపిఎస్‌ పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత అవి తెలియవచ్చు. అందువల్ల యుపిఎస్‌ను సిఐటియు తీవ్రంగా నిరసిస్తోంది. నాన్‌ కంట్రిబ్యూటరీ డిఫైన్డ్‌ అస్యూర్డ్‌ పాత పెన్షన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఒ.పి.ఎస్‌.ను పునరుద్ధరించాలని పోరాడే ప్రభుత్వ ఉద్యోగులకు సంపూర్ణ మద్దతునిస్తామని భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img