– మాజీ ఉప సర్పంచ్ సాగర్, అధికారులు అక్రమంగా తమ నివాసాలు కూల్చివేసారంటున్న నిర్వాసితులు
– బాధితులకు అండగా సి.పి.ఐ. అనుబంధ ప్రజా, మహిళా సంఘాలు
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం మేజర్ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ మారిశెట్టి సాగర్, పంచాయతీ ఈ.ఓ. నారాయణరావు లు కలసి అక్రమంగా తమ నివాసాలు కూల్చివేశారు అంటూ బాధితులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సంఘటన స్థలంలోనే నిరవధిక దీక్ష కు దిగారు. బుదవారం
అర్ధరాత్రి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కూలిన బతుకులు కోసం బాధితులు చేస్తున్న నిరసన దీక్ష పలువురు హృదయాలను కలచివేస్తుంది. చోడవరం పంచాయతీలో మంగళవారం తెల్లవారి జామున మూడు గంటల ప్రాంతంలో వినాయకుడి గుడి ఎదురుగా సుమారుగా 60 సంవత్సరాలు పైబడి నివాసం ఉంటూ, మహిళలు పిల్లలు దివ్యాంగులైన కుటుంబం ప్రభుత్వం ఇచ్చిన 62 గజాల స్థలంలో జీవనం సాగిస్తూ ఉన్నారు. బి ఎన్.ప్రధాన రహదారిలో గల పేదల నివాసాలు పై రియల్ ఎస్టేట్ మాఫియా కళ్ళుపడ్డాయి. స్థానిక టి.డి.పి. ఎమ్మెల్యే రోత్సాహంతో ప్రముఖ ప్రభుత్వ భూ కబ్జాదారుడు,
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు, పంచాయతీ ఉప సర్పంచ్ మారిశెట్టి సాగర్ ఇచ్చే లంచాలకు కక్కుర్తి పడ్డ పంచాయతీ, పోలీస్ అధికారులు కుమ్మక్కయి పేదల ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసారు. ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా రియల్ ఎస్టేట్ మాఫియా ఆదేశాలతో అధికారులు అక్రమంగా కూల్చివేసిన ఇంటివద్దే బాధితులు టెంటు వేసుకుని నిరవధిక దీక్ష కు దిగారు. గడిచిన రెండు రోజులు నుండి ఎండ, వాన లెక్క చేయకుండా రేయింబవళ్ళు న్యాయం కోసం దీక్ష కు దిగిన భాదితులకు అండగా భారత కమ్యునిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యుడు, ఏ.పి. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, అనుబంధ ప్రజా మహిళా సంఘాలు మద్దతు తెలియజేశాయి. దీనిపై కమ్యునిస్టు నాయకుడు రెడ్డిపల్లి మాట్లాడుతూ రెండు రోజులుగా ఎండ, వాన లెక్క చేయకుండా భాధితులు దీక్ష పట్ల కాస్తున్న దాంట్లోనే నివాసం ఉంటున్న కనీసం స్థానిక ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం, కనీసం స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ ఉప సర్పంచ్ సాగర్ తోనే అధికారులు కూడా చేయకలిపినట్టుగా తేటతెల్లమవుతోందన్నారు. దీనిపైన జిల్లా అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. బాధితుల ఇంటిని అక్రమంగా పూర్తిగా ధ్వంసం చేసి, నేలమట్టం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారపైన పంచాయతీ అధికారుల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో దీనిపైన ఆందోళన చేయవలసిన ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు