జనసేనలో చేరిన వై.సి.పి. నాయకులు ….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గవరవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. ముఖ్య నాయకులు బుదవారం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు జనసేనలో చేరిన వాటిని ఖండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన లో చేరిన వారిలో చప్పగడ్డ శ్రీను (పోస్ట్ శ్రీను), దండ అప్పారావు, టి.అర్జున, గుమ్మాల ఈశ్వరరావు, తాటికొండ గణేష్, సత్యనారాయణ తదితరులున్నారు. జనసేన తీర్థం పుచ్చుకున్న నాయకులు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు చాలా బాగున్నాయని, అందువలన పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గవరవరం గ్రామ జనసేన అధ్యక్షుడు చప్పగడ్డ రాము, మండల నాయకుడు కోన వాసు, గవరవరం జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.