విశాలాంధ్ర – ఆదోని : దళిత మహిళ గోవిందమ్మ ను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురు వారం పరామర్శించారు. పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో గత వారంలో దళిత మహిళ గోవిందమ్మను విచక్షణ రహితంగా కొట్టడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలను సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతుల గురించి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున రావాల్సిన పరిహారాన్ని త్వరగాతిన అందితట్టు చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామంలో శాంతిభద్రతల విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీసు పికేట్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. దాడికి పాల్పడిన వారిని పూర్తిస్థాయిలో విచారణ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.