జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి
విశాలాంధ్ర – అనంతపురం : యువత దేశ పురోగతికి వెన్నెముక అని, వారి శక్తి సామర్ధ్యాలతో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐ. ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం నెహ్రూ యువ కేంద్ర, అనంతపురము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ, భారత ప్రభుత్వం కార్యాలయంను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నెహ్రూ యువ కేంద్ర వారు నిర్వహిస్తున్న యువ ఉత్సవ్, యూత్ పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు, స్పోర్ట్స్ మీట్స్, యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్స్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ యువజన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రోగ్రాం ఇన్చార్జి శ్రీనివాసులు, జాతీయ యువజన అవార్డు గ్రహీత బిసాటి భరత్, ఎస్. ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు జీవన్ కుమార్, జయ మారుతి, సాయి ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ సాయి, సామాజిక సేవా కార్యకర్తలు రామకృష్ణ రెడ్డి, మహేష్ బాబు అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా ఆయన నెహ్రూ యువ కేంద్ర కార్యాలయం యందు జాతీయ యువ కార్యకర్తలు మరియు యువతను ఉద్దేశించి సంభాషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురము యువత అన్నింటిలోనూ ముందు ఉండాలని, దానికి కావలసిన ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవాలని తెలియజేశారు. ప్రతిరోజు పని క్యాలెండర్ ని తయారు చేసుకోవాలని, ప్రతి యువత మంచి ఆలోచనలతో సమాజం కొరకు తన వంతు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఇంచార్జ్ శ్రీనివాసులు, జాతీయ యువజన అవార్డు గ్రహీత బిసాటి భరత్, ఎస్. ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు జీవన్ కుమార్, జయ మారుతి, సాయి ట్రస్ట్ వ్యవస్థాపకులు విజయ సాయి, సామాజిక సేవా కార్యకర్తలు రామకృష్ణ రెడ్డి, మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.