Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

సకాలంలో అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి


జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డీపీఓ ప్రభాకర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 490 అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఈ విషయమై ప్రతిరోజు మానిటర్ చేయాలని, అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
వికలాంగుల సంక్షేమం కొరకు జీవో ఎం.ఎస్.నెంబర్ 27 ను అనుసరించాలని, ప్రతి ప్రభుత్వ శాఖలలో అమలు చేయాలని, రోస్టర్ తప్పక పాటించాలని, వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్ అమలు ఏవిధంగా చేయాలో చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ – ఆఫీస్ ద్వారానే ఫైల్స్ నడవాలని, తద్వారా పనులన్నీ వేగవంతంగా, సులభతరం అవుతుందని, ప్రభుత్వ కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ ఈ ఆఫీస్ ను అనుసరించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, ఎస్డిసి శిరీష, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజారావు, కలెక్టరేట్ ఏవో అంజన్ బాబు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి.తిమ్మప్ప, డిఈఓ వరలక్ష్మి, డీఆర్డీఏ పిడి ఈశ్వరయ్య, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, హార్టికల్చర్ డిడి ఫిరోజ్ ఖాన్, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్, డిటిసి వీర్రాజు, సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, మెప్మా పిడి విజయలక్ష్మి, ఎల్డిఎం నర్సింగ్ రావు, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, డిసిఓ అరుణకుమారి, డీఎస్ఓ శోభారాణి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, సర్వే ఏడి రూప్ల నాయక్, చేనేత జౌళి శాఖ ఏడి అప్పాజీ, మార్కెటింగ్ ఏడీ చౌదరి, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, జిల్లా మలేరియా అధికారి ఓబులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img