పిటీషన్లను స్వీకరించిన అదనపు ఎస్పీలు
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కు ప్రజల నుండీ 113 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా ఎస్పీ కె.వి.వి మురళీకృష్ణ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ మరియు అనంతపురం డీఎస్పీ టివివి ప్రతాప్ లు ప్రజల నుండీ పిటీషన్లు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన నాణ్యతగా పరిష్కారం చూపాలనే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలమూలల నుండీ వచ్చిన ప్రజలు స్వేచ్ఛగా పిటీషన్లు అందజేశారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీ పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడారు. లోతుగా వారి సమస్యలను విని అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈకార్యక్రమంలో ఎస్బీ సి.ఐ ఇందిర పాల్గొన్నారు.