Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో 115 ఫిర్యాదుల స్వీకరణ

విశాలాంధ్ర -అనంతపురం : ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు కబ్జాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రస్సెల్ సిస్టం ) కార్యక్రమంలో ప్రజల నుండీ 115 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిల్లో… కొంతమంది విలువైన స్థలాలను ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి భూములు కబ్జా చేయడంపై మరియు సైబర్ నేరాల బారినపడటంపై ఫిర్యాదులు స్వీకరించామన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టామని ఎస్పీ పేర్కొన్నారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరించి సమస్యలు సృష్టించాలనుకుంటే ఎవర్నీ ఉపేక్షించమన్నారు.
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికమయ్యాయని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఈజాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచనలు…
అపరిచితుల నుండీ వచ్చే వీడియో కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోను లిఫ్ట్ చేయరాదు. ఒకవేళ లిఫ్ట్ చేస్తే అవతలి వ్యక్తులు నగ్నంగా ఉండి మీకు చేసిన వీడియోకాల్ ను రికార్డ్ చేసి పోలీస్ కేసులో ఇరికిస్తామని బెదిరించడమే కాకుండా వేదింపులకు గురి చేసి మీ నుండీ డబ్బు దోచేస్తారన్నారు. ఫలానా బ్యాంకు వారమని మొబైల్ ఫోన్లకు ఫోన్ చేసి…ఓ.టి.పి నంబర్ చెప్పమని అడుగుతారు, మీరు ఓటిపి చెప్పగానే మీ ఖాతాను ఖాళీ చేస్తారు. బ్యాంకు వారు ఎవరూ ఓటిపి అడగరని గుర్తుంచుకోవాలన్నారు.
సామాజిక మాధ్యమాలలో ట్రేండింగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని వచ్చే ప్రకటనలు చూసి స్పందించకండి. అదేవిధంగా… ఆ సామాజిక మాధ్యమాలలో వచ్చే లింకులు, ఏపీకె ఫైళ్లు క్లిక్ చేయకండి మా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్ టిప్స్ ఇస్తామని, లాభాలు చూపిస్తామని నమ్మిస్తారు మోసపోకూడదన్నారు. ఏ ఈ పి ఎస్ ( ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ) మోసాలు ఎక్కువ జరిగే వీలున్నందున మీ ఆధార్ లింకును లాక్ చేసుకోవడం వల్ల సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా ఉంటారు
సామాజిక మాధ్యమాలలో వచ్చే పార్ట్ టైం జాబ్ ప్రకటనలు చూసి మోసపోకండి. అవి వాస్తవమా కాదా అని లోతుగా సరిచూసుకున్నాకే ముందుకెళ్లండి. ఫెడెక్స్ కొరియర్ పేరుతో మీకు విదేశాల నుండీ పార్శిల్ కొరియర్ వచ్చిందని… అందులో డ్రగ్స్, వెపన్స్ ఉన్నాయని చెప్పి భయపెట్టి, కంగారు పెట్టి అరెస్టు చేయకుండా ఉండాలంటే ఫైన్ కడితే సరిపోతుందని చెప్పి డబ్బు దోచేస్తారు. జాగ్రత్త పడండి. అవి ఫేక్ అని గుర్తుంచుకోవాలన్నారు
సైబర్ క్రైం జరిగితే తక్షణమే చేయడానికి 1930 మరియు సైబరక్రైమ్ .గోవ్ .ఇన్ కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img