Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

పల్మనరీ మెడిసిన్ కు 5 పీజీ సీట్లు

ఫలించిన వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు కృషి
117 కు చేరిన వైద్య కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు

విశాలాంధ్ర – అనంతపురం : ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్య రావు కృషి ఎట్టకేలకు ఫలించింది. పట్టుదలతో, పల్మనరీ మెడిసిన్ కు పీజీ సీట్లు రాకపోవడానికి ఛాలెంజ్ గా తీసుకుని సమిష్టి కృషితో, ఢిల్లీకి వెళ్లి జాతీయ వైద్య మండలి చైర్మన్ తో సమావేశమై ఎట్టకేలకు అనంతపురంలోని వైద్య కళాశాల పల్మనరీ మెడిసిన్ విభాగానికి ఎట్టకేలకు ఐదు పీజీ సీట్లను మంజూరు అయ్యేలా చేసారు. జాతీయ వైద్య మండలి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావుకు ఈమెయిల్ ద్వారా ఐదు పీజీ సీట్లకు అనుమతినిస్తూ ఉత్తర్వులు పంపించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి ఆచార్య డాక్టర్ తార్ల రామస్వామి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ హెచ్ నాగ శ్రీధరరావు, ఎం అశోక్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వి. సౌజన్య లక్ష్మి, డాక్టర్ కావేటి సతీష్ కుమార్ లు పుష్పగుచ్చాలతో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ అనంత వైద్య కళాశాలకు కేవలం పల్మనరీ మెడిసిన్ కు మాత్రమే పీజీ సీట్లు రాకపోవడం పై ప్రత్యేక దృష్టిని సారించి, నేను,మరియు ఛాతీ వైద్య విభాగ డాక్టర్లు ఢిల్లీ వెళ్లి నేషనల్ మెడికల్ కమిషన్ బృందానికి ఇక్కడ ఉన్న సౌకర్యాలను అన్నిటి గురించి జూన్ 10 2024 న వివరించగా వారు వర్చువల్ మోడ్లో ఇన్స్పెక్షన్ నిర్వహించి అన్ని సదుపాయాలు ఉన్నాయని తృప్తిని తెలిపి ఎట్టకేలకు ఐదు పీజీ సీట్లను మంజూరు చేస్తూ మెయిల్ పంపించడం జరిగిందని తెలిపారు.అనంత వైద్య కళాశాల పీజీ సీట్లు 117 కు చేరుకున్నాయని, మూడు సంవత్సరాలకు గాను 351 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉండడం కళాశాలకు గర్వకారణమని తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైద్యుల కృషి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు గారి ప్రత్యేక చొరవతో పీజీ సీట్లు లభించాయని, ఇప్పుడు మన అనంత వైద్య కళాశాలలో అన్ని విభాగాలలో పిజి సీట్లు ఉండడం నిజంగా సంతోషమని తెలిపారు. టీబీ అండ్ చెస్ట్ హెచ్ ఓ డి డాక్టర్ కార్ల రామస్వామి మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఎంతో శ్రమ తీసుకుని, పట్టుదలతో మమ్మల్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ఎట్టకేలకు 5 పీజీ సీట్లు రావడంలో క్రియాశీలక పాత్ర పోషించారని ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా సూపరింటెండెంట్ డాక్టర్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు గారి సహకారం కూడా ఎంతో ఉందని తెలిపారు. అన్ని విభాగాలలో పిజి సీట్లు రావడంతో డాక్టర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, ఎంబిబిఎస్ విద్యార్థులు, వైద్య కళాశాల ఉద్యోగులు ఆనంద హర్షాతిరేఖాలు వెలిబుచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img