విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని యాదవ్ వీధి వద్ద అనుకోకుండా ఇసుక ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని తగలడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై సమాచారం అందగానే మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా, మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్, అక్కడి వాసులకు భయపడవద్దని సూచించారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి, ధ్వంసమైన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులను కోరారు. అలాగే జరిగిన సంఘటన గురించి మంత్రికి తెలియజేయడంతో అనంతరం ఆయన ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు తెలియజేశారు.. స్తంభం ఏర్పాటు చేయడం కోసం క్రేన్ అవసరం ఉన్నందున దానికై మంత్రి సొంత నిధులు వెచ్చిస్తున్నారని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. అనంతరం విద్యుత్ అధికారులు సాయంత్రం విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.