విశాలాంధ్ర ధర్మవరం:: నేడు రాష్ట్రంలో నెలకొని ఉన్న చేనేత సమస్యల పరిష్కారం కోసం, తన వంతుగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్న డిజైనర్ జుజారు నాగరాజు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. వివరాలకు వెళితే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ కు అట్ హోమ్ అనే కార్యక్రమానికి డిజైనర్ నాగరాజుకు తేనేటి విందుకు ఆహ్వానం ఇంచార్జ్ ఆర్డిఓ అంపయ్య చేతులు మీదుగా ఈనెల 14వ తేదీన అందుకున్నారు. అనంతరం 14వ తేదీ రాత్రి అమరావతికి బయలుదేరి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోను, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోను, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ లను కలిసే అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమ, చేనేతను నమ్ముకున్న కార్మికుల యొక్క సమస్యలను వివరంగా వివరించారు. తదుపరి ముఖ్యమంత్రి కి, గవర్నర్కు నేరుగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. రాజ్ భవన్ లో తేలేరు విందుకు నన్ను ఆహ్వానించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయ గీతాలాపనతో అట్ హోం అనే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ఎంతో ఉన్నత అధికారులను, ప్రముఖ రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ ను కలవడం జీవితములో మరువలేనని తెలిపారు. చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని వివరించడం జరిగిందని తెలిపారు. నేతన్నలకు చేయూతనిచ్చి పరిశ్రమకు పూర్వవైభవము కల్పించాలని కోరినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్లు నా యొక్క విన్నపాన్ని సానుకూలంగా వారు స్పందించడం పట్ల వారు కృతజ్ఞతలు చెప్పడం జరిగిందన్నారు.