అనంతపురం : పట్టణంలోని సబ్ జైలును అనంతపురం జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఖైదీలతో వారు సమావేశాన్ని నిర్వహించి, జైల్లో ఉన్న వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఖైదీలకు గా మీకు వకీలు ఉన్నారా? లేదా? అన్న విషయాలపై ఆరా తీశారు. తదుపరి సబ్ జైల్లో భోజన వసతి ఎలా ఉంది? ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చట్టాలపై ఖైదీలకు అవగాహన కల్పించారు, తదుపరి ఖైదీలకు దిశా నిర్దేశం చేసి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు, భవిష్యత్తులో నేరాలు చేయకుండా ఉండాలని తెలిపారు. సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవి తో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.