విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: జేఎన్టీయూ (అనంతపురం) ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ఆచార్య పి చెన్నారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంచార్జ్ వీసీ ఆచార్య సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కళాశాల అభ్యున్నతకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వీసీ, మాజీ ప్రిన్సిపల్ ఆచార్య సత్యనారాయణ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ రంగానాయక్, దుర్గాప్రసాద్, యూనివర్సిటీ డైరెక్టర్లు బోధన, బోధనేతర సిబ్బంది ,అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.