విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా ఆచార్య వైశాలి జి. ఘోర్పడే గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ .. ఇన్ చార్జ్ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు,రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య నాపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి.. విశ్వవిద్యాలయ కీర్తిని ఇనుమడింప చేస్తానని పేర్కొన్నారు.అనంతరం వీసీ,రిజిస్ట్రార్ ఆచార్య పి.ఆర్. భానుమూర్తి , ఆచార్య సి. శశిధర్ , ఆచార్య బి. ఈశ్వర్ రెడ్డి , యూనివర్సిటీ డైరెక్టర్లు, భోధన భోధనేతర సిబ్బంది, ఔట్సొర్సింగ్ సిబ్బంది పలువురు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.