విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి పట్టణ పరిధిలోని పి.కొండాపురం రోడ్డులో చేపట్టిన అక్రమ గుడిసెల నిర్మాణాలను తహసిల్దార్ శ్రీధర్ మూర్తి మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ గుడిసెలో నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి త్వరలోనే తొలగిస్తామని, నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు. కబ్జాదారులు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సునీత భాయ్, శ్రీకాంత్ రెడ్డి, భాగ్యమ్మ, రమేష్ నాయక్, వీఆర్ఏ సుంకన్న, తదితరులు పాల్గొన్నారు