జిల్లాలోని డీఎస్పీలతో నూతన ఎస్పీ ప్రత్యేక సమావేశం
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిగా జిల్లాలోని డీఎస్పీలతో ఎస్పీ డిపిఓలోని తన ఛేంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా… జిల్లాలోని తాజా పరిస్థితులను సమీక్షించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల్లో భరోసా కల్గించడంలో దోహదం చేసే బేసిక్ పోలీసింగ్ ను మెరుగు పరుచుకోవాలన్నారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, డీఎస్పీలు టి.వి.వి ప్రతాప్, రవికుమార్, జనార్ధన్ నాయుడు, శివ భాస్కర్ రెడ్డి, బి.వి.శివారెడ్డి, మునిరాజ ( ఏ.ఆర్) పాల్గొన్నారు.