: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : మొక్కలు నాటే కార్యక్రమంలో అనంతపురం జిల్లా రాష్ట్రానికే రోల్ మోడల్ నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో జంతలూరు, సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణంలో వన మహోత్సవం-2024 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ జగదీష్, కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు, డీఎఫ్ఓ వినీత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, వైస్ ఛాన్స్లర్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఏ కోరి, ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెర్రర్, జిల్లా అధికారులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ..ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లాలో వర్షాలు జూన్ మాసంలో బాగా వచ్చాయని, జూలై నెలలో ఇబ్బందికరంగా ఉన్నాయని, మళ్లీ ఈ నెలలో వర్షం వచ్చిందని, జిల్లాలో రైన్ ఫాల్ స్టేటస్ ఐదు నుంచి పది సంవత్సరాలు యావరేజ్ గా తీసుకుంటామని, ప్రస్తుతానికి వర్షపాతం నమోదు సాధారణ స్థాయిలో ఉందని, ఇందుకు సంతోషకరంగా ఉందన్నారు. వర్షం అధికంగా కురవడం వల్ల పంటనష్టం జరిగిన చోట వ్యవసాయ, ఉద్యాన శాఖల తరఫున నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, రైతులకు పరిహారం, ఇన్సూరెన్స్ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ సీజన్లోనే ప్లాంటేషన్ చేపట్టాలని, జిల్లాలో వ్యూహాత్మక, శాస్త్రీయ పద్ధతిలో వెళ్ళామని, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చెట్ల పెంపకం చేయించామని, గ్రామీణ ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మొక్కల పెంపకం చేశామన్నారు. రాష్ట్రంలోనే అవెన్యూ ప్లాంటేషన్ అతి ఎక్కువ అనంతపురం జిల్లాలో చేపట్టడం జరిగిందని, 113 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ చేశామని, అలాగే బ్లాక్ ప్లాంటేషన్ 80 హెక్టార్లలో పూర్తయిందన్నారు. 94 ఇన్స్టిట్యూషన్స్ లో ప్లాంటేషన్ చేపట్టామని, ప్రతి చోటా 100 కింద ఎక్కువ మొక్కలను నాటడం జరిగిందని పేర్కొన్నారు. దీంతోపాటు జిల్లాలో వినూత్నంగా బౌండరీ ప్లాంటేషన్ చేశామని, వ్యవసాయ భూములను రైతులు ఖాళీగా వదలకుండా ఏవైనా పంటలు సాగు చేయాలని, వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో ఇబ్బంది ఉంటే ఎన్ఆర్ఈజీఎస్ కింద బౌండరీలలో టేకు ప్లాంటేషన్ చేపడుతున్నామని, వర్షం వచ్చినప్పుడు నాటే నీరు పోస్తే బాగా పెరుగుతాయని, టేకు చాలా డ్రాట్ రిసిస్టెంట్ ఉన్న చెట్టని, 20 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు నుంచి రైతుకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం జరుపుకోవాలని చెప్పడం చాలా సంతోషకరమని, జిల్లాలో ప్రతి కార్యాలయం కూడా వారి కార్యాలయం ఆవరణంలో, హాస్టల్ లలో ప్లాంటేషన్ చేయించామని, ప్రజలంతా మొక్కల పెంపకాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవాలని, అందరూ మొక్కల పెంపకంలో బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. రాష్ట్రానికి లేదా దేశానికి చూస్తే అటవీ ప్రాంతం 33 శాతం పైబడి ఉండాలని, దీనిని మనమంతా గమనించాలని, అంత అడవి ప్రాంతం లేకపోతే మన ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం అందించే సహాయంతో పాటు, ఎన్జీవోలు కూడా కృషి చేస్తున్నారని, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఆర్డిటి సంస్థ వారు, రెడ్స్ సంస్థ, డిస్కవర్ అనంతపూర్ వారు కార్పొరేషన్ పరిధిలో చేస్తున్న కృషి ఇలా చాలా సంస్థలు ఉన్నాయని, వీరంతా 40, 80 టన్నుల బరువున్న చెట్లను సైతం ఒకచోట నుండి మరొక చోటుకు తరలిస్తున్నారని, డిస్కవర్ అనంతపూర్ వారు ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని, అలాగే పచ్చదనం కాపాడుకోవటం కోసం రెడ్ సంస్థ వారు కృషి చేస్తున్నారని, ఇందులో ఆర్డిటి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువేనని, అనంతపురం జిల్లాలో నీరు అందించే పలు కార్యక్రమాలకు కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇలాంటివన్నీ మన అనంతపురం జిల్లాలో జరగటం రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఇంటి వద్ద ఒక చెట్టు అయినా నాటాలని కోరుకున్నారు. జిల్లాలో బౌండరీ ట్రెంచ్, ఫామ్ ఫాండ్ లాంటివి ఏర్పాటు చేసి వచ్చిన వర్షం నీరు అక్కడే ఇంకిపోయేలా చేసేది మన చేతిలోనే ఉందన్నారు. విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ఈ వన మహోత్సవ నేపథ్యంలో కలిసికట్టుగా చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనదని, 2016- 17 లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ కోసం భూసేకరణ చేయడం జరిగిందని, ఇక్కడ చెట్ల పెంపకం చేపట్టడంతో పచ్చదనం వెళ్లి విరుస్తుందన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా వనమహోత్సవం పేరుతో జిల్లా కలెక్టర్, డీఎఫ్ఓ అటవీ ప్రాంతంలో పార్కు లాగా నిర్మిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కర్ణాటకకు చెందిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, విసి లాంటి కష్టపడి పని చేసే అధికారులు జిల్లాలో ఉండడం మన అదృష్టమని, జిల్లాను అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామన్నారు.బిప్రతి ఒక్కరూ మన పరిసరాలలో, రోడ్డు కిరువైపులా, ఖాళీ ప్రదేశాలలో, స్కూల్, కాలేజీల,యూనివర్సిటీలలో చెట్లు నాటమే మన కర్తవంగా భావించాలన్నారు.
ఈ సందర్భంగా మొక్కల పెంపకం అందరూ బాధ్యతగా చేపట్టాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్, డీఎఫ్ఓ వినీత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, వైస్ ఛాన్స్లర్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ ఏ కోరి,ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచు ఫై ర్రర్, జిల్లా జైల్ సూపరింటెండెంట్, ఎన్జీవోలు, విద్యార్థులు, తదితర జిల్లా అధికారులు, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.