విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నిన్నటి రోజున అనంతపురం జిల్లా ఎస్పీగా పి. జగదీష్ ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. నేడు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ఆయన చాంబర్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అనంతపురం నియోజకవర్గ శాంతిభద్రతల పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు.