విశాలాంధ్ర- అనంతపురం : ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, విశాఖ ఉక్కు సాధన కన్వీనర్, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎంవి.రమణ గత రెండు రోజులు క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఎంవి.రమణ కుమారుడు లాయర్ వేణు కుటుంబ సభ్యులను శనివారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కాలువ శ్రీనివాసులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు అటువంటి వ్యక్తి మరణించడం సిపిఐ పార్టీకే కాదు సమాజం కూడా తీరని లోటు అన్నారు .ఎంవి రమణ ఆశయాల కొరకు సిపిఐ పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులు ఆ దిశగా వెళ్లాలని తెలియజేశారు. ఎంతో మంది యువకులకు ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఆదినారాయణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జే రాజారెడ్డి, ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి వీకె కృష్ణుడు , పాల్గొన్నారు