: జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అర్జీలను స్వీకరించారు.
జాయింట్ కలెక్టర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 122 అర్జీలను ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పెండింగ్ ఉంచకుండా అర్జీలను ఎప్పటికప్పుడు నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.