గ్రామపంచాయతీ వార్డు సభ్యుల విజ్ఞప్తి
విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు ఏ విధంగా చేపట్టాలి అనే అంశాలపై చర్చించడానికి ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి గౌస్ సాహెబ్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శిని వార్డు సభ్యులు చేజాల ప్రభాకర్, నిరంజన్ గౌడ్, రామాంజనేయులు, రవి, పద్మావతి మాధవి, జానకి తదితరులు కలిశారు. సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుతం అనేక ప్రాంతాలలో విష జ్వరాలు డెంగ్యూ మలేరియా వ్యాధులు విపరీతంగా ప్రభలుతున్నాయని ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు అవసరం ఉందని తెలిపారు. అలాగే ఉరవకొండ పట్టణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కృషితో ఇంటి పట్టాలు ఇచ్చి కాలనీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కాలనీలకు సంబంధించి పేర్లు పెట్టేందుకు విన్నపాలు కూడా వచ్చాయని వాటిపై కూడా చర్చించి తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి గౌస్ సాహెబ్ మాట్లాడుతూ సమావేశం ఏర్పాటు చేసి వార్డు సభ్యులు యొక్క సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.