విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని ఆర్డిటి మైదానంలో ఆరవ రోజు కూడా అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఉత్సాహపూరితంగా కొనసాగాయి.
మొదటి మ్యాచ్ ఎగ్ రైస్ పిటిపి కి దోరగి 11 టీం మధ్య జరిగిన మ్యాచ్లో దొరగి 11 టీం మీద ఎగ్ రైస్ పిటిపి టీం 76 పరుగుల తేడాతో గెలుపొందింది.
రెండవ మ్యాచ్ రఘు 11 సికేపల్లి టీం కి స్పార్టెన్స్ టీం కి మధ్య జరిగిన మ్యాచ్లో రఘు 11 సికేపల్లి టీం మీద స్పార్టెన్స్ టీం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
మూడవ మ్యాచ్ సూపర్ కింగ్స్ పెనుకొండ టీం కి మేడాపురం కింగ్స్ టీం మధ్య జరిగిన మ్యాచ్లో సూపర్ కింగ్స్ పెనుకొండ టీం మీద మేడాపురం కింగ్స్ టీం ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
నాలుగవ మ్యాచ్ స్పార్టెన్స్ పెనుకొండ టీం కి ఇండియన్ 11 కేటిసి టీం కి మధ్య జరిగిన మ్యాచ్లో స్పార్టెన్స్ పెనుకొండ టీం మీద ఇండియన్ 11 కేటిసి టీం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఐదవ మ్యాచ్ దుర్గ 11 టీం కి దంపేట్ల టీం కి మధ్య జరిగిన
మ్యాచ్లో దుర్గ 11 టీం మీద దంపేట్ల టీం 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ ఆరు మ్యాచుల్లో తమ ప్రతిభను చూపిన ఎగ్ రైస్ టిపిటి టీం బాబావలి, స్పార్టెన్స్ పెనుకొండ గుండు, మేడాపురం కింగ్స్ నరేష్, ఇండియన్ 11 కేటిసి శివప్రసాద్, దంపెట్ల హరికృష్ణ అనే ఐదుగురు ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్, మంత్రి పిఏ మల్లికార్జున,బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి చెర్లోపల్లి నారాయణస్వామి, జింక చంద్ర, సాకే ఓబ్లేస్, బిల్లే శ్రీనివాసులు, మిరియాల అంజి తదితరులు పాల్గొన్నారు.