విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం, కల్లుకుంట, హెచ్ మురవణి, బసలదొడ్డి, కంబలదిన్నె, జాలవాడి, పీకలబెట్ట, బాపులదొడ్డి, చిన్నకడబూరు, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో సోమవారం వినాయకుల నిమజ్జనం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గత మూడు రోజుల నుంచి వినాయకునికి వివిధ రకరకాలైన పిండివంటకాలతో నైవేద్యములు సమర్పించారు. భక్తులు పెట్టిన నైవేధ్యాన్ని బొజ్జగణపయ్య ఆరగించారు. మూడు రోజులపాటు విజ్ఞేశ్వరులు ప్రత్యేక పూజలు అందుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వినాయకుల నిమజ్జన ఊరేగింపు ప్రధాన రహదారుల వెంబడి గణపతి బొప్పా మోరియా నినాదాల మధ్య అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలోని 65 గణపయ్య విగ్రహాలను ఎల్లెల్సీకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నిరంజన్ రెడ్డి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వినాయకుల చేతిలో లడ్డుకు భలే గిరాకీ
మండలంలో వివిధ గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా కొలువుదీరిన వినాయకుల చేతిలోని లడ్డులకు వేలం పాటలో భలే గిరాకీ లభించింది. పెద్దకడబూరు మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామంలో కొలువుదీరిన గణేష్ చేతిలోని లడ్డును ఎంపీటీసీ మహాదవ 32 వేల రూపాయలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. అలాగే మండల కేంద్రమైన పెద్దకడబూరులోని తేరు బజారులో కొలవైన వినాయక చేతిలోని లడ్డును మొట్రు ఈరన్న రూ. 21 వేలు చౌడేశ్వరీ కాలనీలో కుమ్మరి నీలకంఠప్ప ఇంటి వద్ద వినాయకుని చేతిలోని లడ్డూను పద్మసాలె గోపాల్ రూ. 16 వేలకు దక్కించుకున్నారు. చౌడేశ్వరీ గుడి వద్ద పల్లెపాడు లక్ష్మన్న రూ. 13, 001, లక్ష్మీపేటలో మొట్రు వీరేష్ 7500, బస్టాండ్ ఆవరణలో ఇబ్రహీంపురం చంద్ర రూ. మునిస్వామి గుడి దగ్గర గణేష్ లడ్డును వెంకన్న 7500, బస్టాండ్ ఆవరణంలో ఇబ్రహీంపురం చంద్ర 7,101, సుంకలమ్మ గుడి వద్ద తలారి ఈరన్న రూ. 6000, కురువవీధిలో నేసే గణేష్ 5,500, తహసీల్దార్ కార్యాలయం వద్ద కురువ నరశింహులు రూ. 5001 గణేషుని లడ్డూలను వేలం పాటలో దక్కించుకున్నారు.ఈ నిమజ్జనంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.