విశాలాంధ్ర, కదిరి : కదిరి రూరల్ పరిధిలోని ఎరుకలవాండ్లపల్లి సమీపంలో ఉన్న హరీష్ పాఠశాల క్రీడాకారులకు ప్రిన్సిపాల్ యం.యస్. కిరణ్ చేతుల మీదుగా గురువారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నం జిల్లాలోని భీమిలీలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో తమ పాఠశాలలో 10వ, 8వ, 7వ తరగతి చదువుతున్న శ్రీజా రెడ్డి,దీక్షిత,శైలజ,వినూత్న, లహరి,రేవంత్ రాయల్,కార్తీక్ నాయుడు,యువరాజ్,చరణ్ నాయక్ లు పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. వీరిలో ఇరువురు క్రీడాకారులు హిమాచల్ ప్రదేశ్ లోని ఊనాలో జరిగే జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారన్నారు. తమ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు జిల్లా,రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడం సంతోషదాయకమన్నారు.
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని,క్రీడలు శారీరకంగా,మానసికంగా దృఢత్వం పెంచుతాయని చెప్పారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసన్న కుమార్ కు ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులుసిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.