విశాలాంధ్ర – అనంతపురం : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో రిడ్స్ స్వచ్ఛంద సంస్థc వారు “మీకు తెలుసా “ఐ ఈ సి హెచ్ఐవి ఎయిడ్స్ పై గురువారం అనంతపురం లోని కళ్యాణదుర్గం బైపాస్ స్వయం సహాయక సంఘాల వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిడ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ నరేష్ మాట్లాడుతూ హెచ్ఐవి మరియు లైంగికంగాసంక్రమించే అంటువ్యాధుల
గురించిన సమాచారాన్ని అందించారు. రాష్ట్రంలో ఇంటెన్సిఫయిడ్ ప్రచార కార్యక్రమాన్ని “మీకు తెలుసా ?” అన్న నినాదంతో నాకో,ఏపిశాక్స్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ చేపడుతోంది.ఇందులో భాగంగా హెచ్.ఐ.వి ఎలా వస్తుంది ఎలా రాదు,ఒక వేళ హెచ్.ఐ.వి పాజిటివ్ అయితే ఏ ఆర్ టి మందులు తీసుకుని ఈ వైరస్ నుండి పూర్తిగా కోలుకొని ప్రాణాల మీదకు రాకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు.ప్రజలు హెచ్ ఐవి గురించిన అవగాహన కలిగి ఉండాలని అలాగే మీరు మీ స్వయం సహాయక సంఘాల మీటింగ్ ల్లో హెచ్.ఐ.వి గురించి చర్చించాలని తెలియజేశారు.యువత చెడు సావాసం చెడు మధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండి హెచ్.ఐ.వి బారిన పడకుండా జీవితాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు.అలాగే హెచ్.ఐ.వి వ్యాధి సోకిన వారి పట్ల ప్రేమతో కలసి మెలసి జీవించాలని వారిని వివక్షతకు గురిచేయకూడదని అలాగే హెచ్ఐవి మరియు ఎయిడ్స్ (ప్రివెన్షన్ కంట్రోల్) యాక్టు -2017 గురించి, 1097 టోల్ ఫ్రీ నెంబరు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమం లో నరేష్,అలివేలు ,అనిత,విజయకుమారి, ఎస్ జి హెచ్ లీడర్స్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.